సౌంద‌ర్య బ‌యోపిక్ చేయ‌నున్న స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌?

Updated By ManamThu, 05/17/2018 - 18:39
soundarya

soundaryaఅలనాటి మేటి న‌టి సావిత్రి బయోపిక్ ‘మహానటి’.. తాజాగా విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుండడంతో.. ఇప్పుడు తెలుగులో మరిన్ని బయోపిక్‌లు కార్యరూపం దాల్చనున్నాయి. ఇందులో భాగంగానే నిన్నటితరం నటీమణి సౌందర్య జీవిత కథను కూడా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 1992లో కెరీర్‌ను ప్రారంభించి 2004 వరకు.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మ‌ల‌యాళం, హిందీ భాషల్లో మొత్తం 100కి పైగా సినిమాల్లో నటించారు సౌందర్య. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈమె నెంబర్ వన్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే.. 2004 ఎన్నికల సమయంలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారానికని వెళ్ళి హెలికాప్టర్ ప్రమాదంలో అనూహ్యంగా దుర్మరణం పాల‌య్యారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటీమణి జీవిత కథను బయోపిక్‌గా తీస్తే ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని నిర్మాత రాజ్ కందుకూరి ('పెళ్ళి చూపులు', ‘మెంటల్ మదిలో’ చిత్రాల నిర్మాత) భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ దిశగా అడుగులు కూడా సాగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన‌  అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే ఎన్టీఆర్ బయోపిక్ (‘యన్.టి.ఆర్’), వై.ఎస్‌.ఆర్‌ బయోపిక్ (‘యాత్ర’) నిర్మాణ ద‌శ‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. తాజాగా ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు తేజ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

English Title
successful producer going to produce sondarya biopic?
Related News