2019-20కు బడ్జెట్ రూ.6150కోట్లకు స్టాండింగ్ కమిటీ అమోదం

Danakisor

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ 2019- 20 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ముసాయిదాను గురువారం జరి గిన స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ స్టాంగింగ్ కమిటి సమావే శానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ హాజరయ్యారు. 2019-20సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను గత డిసెం బర్ 20వ తేదీన జరిగిన స్టాండింగ్ కమిటీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై నేటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఆమోదించారు. అనంతరం ఈ బడ్జెట్‌ను జనరల్ బాడీ సమావేశంలో చర్చించి తుది బడ్జెట్ తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదం కోసం ఫిబ్రవరి 20వ తేదీలోపు పంపి చాల్సి ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. 

2018-19 ఆమోదిత బడ్జెట్ రూ.6076.86కోట్లు
2018-19 సవరించిన బడ్జెట్ మొత్తంరూ.5375కోట్లు
2019-20కు ప్రతిపాదిత బడ్జెట్ మొత్తం రూ.6150కోట్లు
మేజర్ ప్రాజెక్టులకు ప్రతిపాదిత బడ్జెట్ మొత్తం రూ.5388కోట్లు
2019-20ప్రతిపాదిత మొత్తం బడ్జెట్ రూ.11538కోట్లు
 

Tags

సంబంధిత వార్తలు