ఆధ్యాత్మిక మార్గదర్శి

vivekananda

నేటి యువతకు ఆయన ఇచ్చిన సందేశం సరిగ్గా సరిపోతుంది. వాటిని తు.చ. తప్పకుండా పాటిస్తే ఎన్నో సమస్యలు మటుమాయం అవుతాయి. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగు తాయి. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజ యాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.

‘ఆధునిక యువతపై నాకు విశ్వాసం ఉంది... నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేది వారే, అలాంటి యువత ముందు బలిష్టంగానూ, జవ సంపన్నులుగానూ, ఆత్మ విశ్వాసులుగానూ, ఋజు వర్తనులుగానూ మారాలి. ఇలాంటి యువత వంద మంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయ వ’చ్చని యువశక్తిని కొనియాడి, భవిష్యత్తు తరాలకు ఓ మార్గదర్శిగా నిలిచిన స్వామి వివేకానంద జయంతి నేడు.  వివేకానందుడి సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి. యువశక్తి తలచు కుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని వివేకా నందుడు పేర్కొన్నాడు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని వివేకానందుడు కోరుకున్నాడు.  ‘వివేకానందుడు ఎట్టి ఘనకార్యాలు చేశాడో చెప్పగలి గింది మరొక వివేకానందుడు మాత్రమే’ అని స్వామిజీ  ప్రగాఢమైన నమ్మకం. ఈయన జన్మదినా న్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకొంటున్నాం. భవిష్యత్తు తరాలకు ఆయన ఓ మార్గదర్శి. 1863 జనవరి 12 మకర సంక్రాంతి పర్వదినాన దత్తవంశం  మేధస్సుతో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలోని సిమ్లా అనే పేటలో విశ్వ నాథ దత్తా, భువనేశ్వరీ దేవీ దంపతులకు భారత జాతికి ఆశాజ్యోతిగా వివేకానంద జన్మించాడు. వీరేశ్వ రుడు  అను నామకరణం చేసి నరేన్, బిలే  అని ము ద్దుగా పిలిచేవారు. వివేకానందునిగా మార్పు చెందే వరకు ‘నరేంద్రనాథ్ దత్తా’గా  ఖ్యాతిగాంచాడు.  వివేకానందుడు యవ్వనంలోకి అడుగుపెట్టగానే పాఠ్య పుస్తకాలతో తృప్తి పడక, ప్రామాణిక గ్రంథాలు చదివేవాడు. వివాహ ప్రస్తావన వస్తే ‘నేను బ్రహ్మచర్య జీవితం గురించి చాలా ఆలోచించాను. కాలాన్ని ఎదిరించి నిలబడే బ్రహ్మచారి ఘనతే ఘనత. అందరివలే ఐశ్వర్య భోగాలకు పాకులాడక శాశ్వతానంద ప్రాప్తికోసం యత్నిస్తాను’ అని సన్యాస జీవితంలో కల గొప్పదనాన్ని వివరించి, సన్యాస జీవితంపై తనకు గల అనురక్తిని వ్యక్తం చేశాడు. తరువాత నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకా నందుడిగా మారాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతడికి సోదర, సోదరీ మణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రం, ఒక కమండలం, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యలో గుడి సెల్లోనూ, సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేల మీదనే నిద్రించేవాడు. అనేకమంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలాదూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయ తలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు.
సెప్టెంబర్ 11న స్వామీ వివేకానంద విశ్వవిఖ్యాత చికాగో ఉపన్యాసానికి 125 సంవత్సరాలు పూర్తయ్యా యి. ఆయన తన ఉపన్యాసంలో భారతదేశపు ఏకా త్మ, జీవన దృష్టి ఆధారంగా విశ్వమంతా ఒక కుటుం బం అనే భావాన్ని అందరి ముందు ఉంచారు. అది కేవలం సిద్ధాంతపరమైన భావన కాదు. అది ఆయన సంపూర్ణంగా విశ్వసించిన, ఆయన హృదయం నుండి వచ్చిన విషయం. చికాగో ఉపన్యాసాన్ని ‘నా అమెరికా సోదర సోదరిమణులారా...’ అనే సంబోధనతో ఆయన ప్రారంభించినప్పుడు సభికులంతా ఒక్కసారి గా ఉత్తేజితులయ్యారు. లేచి నిలబడి కొన్ని నిము షాలపాటు వారు చేసిన కరతాళధ్వనులకు సభాగృ హం మారుమోగిపోయింది.

స్వామీ వివేకానంద తన ఉపన్యాసంలో ‘ఏ ధర్మమైతే ప్రపంచానికి గౌరవించడం నేర్పిందో ఆ ధర్మానికి చెందినవాడిగా నేను గర్విస్తాను. అన్ని మతా లు సత్యమని మేము అంగీకరిస్తా’మని చెప్పారు. స్వామీజీ ఇంకా ఇలా అన్నారు  ‘మతతత్వం, పిడి వాదం, వాటి భయంకరమైన వారసత్వం ఈ సుందర మైన భూమిపై చాలాకాలం రాజ్యం చేశాయి. అవి ఈ భూమిని హింసతో నింపేశాయి. మానవుల రక్తంతో తడిపేశాయి. సభ్యత సంస్కారాలను నాశనం చేశా యి. దేశం మొత్తాన్ని నైరాశ్యంలో ముంచేశాయి. ఈ భయంకరమైన దహనకాండ లేకపోతే మానవ సమా జం ఇప్పటికి ఎంతో అభివృద్ధి చెందే’దని అన్నారు. స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ఆయన ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమికూడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తరువా త ఆయన్ని తమ ఇళ్ళకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభిం చింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వార్తాపత్రికలు ఆయనను ఘనతను, వాగ్ధాటిని శ్లా ఘించాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదితగా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. తరువాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారు. నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది.  ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు. ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలు వల ప్రాధాన్యాన్ని బోధించేవాడు. అదే స్ఫూర్తితో, ల క్ష్యంతో 1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. తరువాత రెండు సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూర్ వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవ నాల్ని నిర్మించాడు. ఈ మఠం తరువాత శాఖోప శాఖలుగా విస్తరించింది. ‘వ్యక్తి మోక్షానికి, ప్రపంచ హితానికి’ అనే నినాదం మీద రామకృష్ణా మఠాన్ని స్థాపించాడు. అవిశ్రాంతంగా పనిచేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. జులై 4, 1902న యథావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వ ర్తించుకున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వ త నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లి దండ్రులను కోల్పోయిన అనాథలవలే దు:ఖించారు. నేటి యువతకు ఆయన ఇచ్చిన సందేశం సరిగ్గా సరిపోతుంది. వాటిని తు.చ. తప్పకుండా పాటిస్తే ఎ న్నో సమస్యలు మటుమాయం అవుతాయి  ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందం గా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.
 కాళంరాజు వేణుగోపాల్
8106204412
 

సంబంధిత వార్తలు