అపురూపమైన గోళ్లకు వీడ్కోలు!

Updated By ManamThu, 07/12/2018 - 11:32
Shridhar Chillal worlds longest fingernails
Shridhar Chillal

న్యూయార్క్ : దాదాపు 66ఏళ్లుగా ప్రాణప్రదంగా పెంచుకున్నాడు. వాటిని ఎంతో అపురూంగా చూసుకున్నాడు. ఎంత కష్టమొచ్చినా వాటికి మాత్రం ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకున్నాడు. వాటివల్లే అతడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 2016లో ప్రపంచంలో అత్యంత పొడవైన గోళ్లతో గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కాడు. కానీ...తప్పలేదు. ఇంతకాలం ఎంతో అపురూపుంగా చూసుకున్న ఆ చేతిగోళ్లను కత్తిరించుకున్నాడు పూణెకు చెందిన శ్రీధర్ ఛిల్లాల్. 

ఎందుకంటే ఇప్పుడతని వయసు 82 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలు చుట్టుముట్టడంతో తప్పనిసరి పరిస్థితిలో చేతిగోళ్లను కత్తిరించాల్సి వచ్చింది. 1952 నుంచి అతడు చేతిగోళ్ళను పెంచగా ఇప్పుడు వాటి పొడవు 197.8 సెంటీమీటర్లు. అంటే దాదాపు రెండు మీటర్లన్నమాట. అయితే శ్రీధర్ ఛిల్లాల్ తన గోళ్లను న్యూయార్క్‌లోని టైమ్ స్వేర్‌లో జరిగిన ‘నెయిల్ క్లిప్పింగ్ సెర్మనీ’లో కత్తిరించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను నిన్న సోషల్ మీడియాలో షేర్ చేయగా 1.3 లక్షల వ్యూస్‌తో పాటు వందలాది కామెంట్లు వచ్చాయి.  కాగా  తన గోళ్లను సజీవంగా మ్యూజియంలో ఉంచాలని  శ్రీధర్ ఛిల్లాల్ అమెరికా ప్రాంఛైజీ సంస్థ‘రిప్లెయిస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్‌’ను కోరాడు. 

English Title
Shridhar Chillal cut his Cut His Fingernails After 66 Years
Related News