బస్సు కిందకు దూసుకెళ్లిపోయిన స్కూటీ

Updated By ManamTue, 05/29/2018 - 18:37
Shocker Man Just Missed, Close Call With a Bus

Shocker Man Just Missed, Close Call With a Busబెంగళూరు: లేచిన వేళా విశేషం బాగుండడమంటే ఇదేనేమో.. ఓ వ్యక్తి దాదాపు మరణం అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వ్యక్తి స్కూటీ బస్సు కింద నలిగిపోయింది. అదృష్టవశాత్తూ కేవలం బైకు మాత్రమే బస్సు కిందకు వెళ్లడంతో అతడు చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన కర్ణాటకలోని వైట్లలో జరిగింది. జరిగిన ఆ ఘటన అంతా కూడా సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి తన స్కూటీపై వేగంగా వస్తూ మూలమలుపులో ఓ మినీ వ్యాన్‌ను ఓవర్‌టేక్ చేయబోయాడు. అయితే, అకస్మాత్తుగా ఎదురుగా ఓ బస్సు వస్తుండడాన్ని గమనించి బైకు నడిపే వ్యక్తి.. దానిని నియంత్రించేందుకు ప్రయత్నించాడు. దాదాపు ఎదురుగా దగ్గరకు వచ్చే సమయంలోనే బైకును వంచేసి తాను అటు వైపుగా పడిపోయాడు. బైకు పైనుంచి బస్సు వెళ్లిపోయి కొంత దూరంలో ఆగింది. అతడు మాత్రం బస్సుకు కొంచెం అటుగా పడిపోయాడు. అనంతరం అతడు లేచి ఎగాదిగా చూసుకున్నాడు. చుట్టుపక్కలవారు వచ్చి అతడిని పరిశీలించి చిన్నగాయమైనా కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తి వివరాలు మాత్రం తెలియరాలేదు.

English Title
Shocker Man Just Missed, Close Call With a Bus
Related News