షారుఖ్ ఖాన్ రంజాన్ కానుక 

Updated By ManamWed, 06/13/2018 - 23:35
sharukh

imageబాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ‘జీరో’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ మరుగుజ్జుగా కనిపించబోతున్నారు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఆమధ్య విడుదలైంది. ఈ టీజర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని రంజాన్ కానుకగా మరో టీజర్‌ను అభిమానులకు అందించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్, ఆనంద్ ఎల్. రాయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, శ్రీదేవి, రాణీ ముఖర్జీ, కాజోల్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

English Title
Shahrukh Khan Ramzan gift
Related News