తల్లీకూతుళ్లపై తండ్రీకొడుకులు అత్యాచారం.. అరెస్ట్!

Updated By ManamFri, 09/14/2018 - 17:30
Self-Styled Godman, Ashu Maharaj, Rape Of Woman, Minor
  • పోలీసుల అదుపులో ఆషు మహరాజ్, సమర్ ఖాన్‌.. 

Self-Styled Godman, Ashu Maharaj, Rape Of Woman, Minorన్యూఢిల్లీ: ఢిల్లీలోని తన ఆశ్రమంలో ఓ మహిళతో పాటు ఆమె మైనర్ కుమార్తె మీద కూడా అత్యాచారం చేసిన కేసులో అషు మహరాజ్ అలియాస్ ఆసిఫ్‌ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కొడుకు సమర్‌ఖాన్ కూడా మహిళపై అత్యాచారం చేశాడని, అతడిని కూడా క్రైంబ్రాంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఏసీపీ (క్రైం) రాజీవ్ రంజన్ తెలిపారు. నిందితులిద్దరినీ విచారిస్తున్నట్లు చెప్పారు. 

తనను తాను స్వామి, బాబాగా చెప్పుకొనే ఆషు మహరాజ్, ఆయన స్నేహితులు ఆయన కొడుకు 2008 నుంచి 2013 సంవత్సరాల మధ్య పలు సందర్భాలలో తనపై అత్యాచారం చేశారని సదరు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురిని కూడా తీసుకురమ్మని ఓ సందర్భంలో ఆషు మహరాజ్ చెప్పడంతో తాను తీసుకెళ్లగా, ఆమెపై కూడా అత్యాచారం చేశారని ఆమె తెలిపారు. హౌజ్ ఖాస్ పోలీసు స్టేషన్‌లో ఆషు మహరాజ్‌పై గత వారం కేసు నమోదైంది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం కేసును క్రైం బ్రాంచికి బదిలీ చేశారు. 

English Title
Self-Styled Godman Ashu Maharaj Arrested For Alleged Rape Of Woman, Minor
Related News