పొగ మత్తుతో లక్ష్యం చిత్తు

smoke

మనిషి దశలలో చాలా ప్రముఖమైనది యుక్తవయస్సు. యుక్తవయసులో కలిగే అనుభవాలు మనిషి జీవితాంతం వెన్నంటే ఉంటాయి. ఉన్నత స్థితికి ఎదగాలంటే యుక్త వయసులో తీసుకునే నిర్ణయాలు ప్రధానమైనవి. మధుర స్మృతులు కావచ్చు లేదా మచ్చగా మిగిలే గాయాలు కావచ్చు. బంగారం లాంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువత ఒక్కొక్క అడుగు వేయాలి. యుక్తవయసులోనే శారీరక, మానసిక పరిపక్వత అభివృద్ధి చెందుతాయి. ఈ వయస్సులో కొత్త అంశాలను కనుగొనడానికి, శోధించడానికి ప్రయత్నాలు చేయడంలో అత్యుత్సాహన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇటీవల యువత కొత్త పుంతలు తొక్కుతోంది. స్మార్ట్ ఫో న్ వినియోగంతో మంచికంటే ఎక్కువ చెడుకే సులభంగా, తొందరగా  ప్రభావితమవుతున్నారు. ప్రస్తుతం  సరదాగా యువత చేసుకుంటున్న స్మోకింగ్ (ధూమపానం) అలవాటే జీవితాంతం కొనసాగే చెడు అలవాటుగా మారుతోంది. ఇది  వ్యసనంగా మారి క్రమంగా ప్రాణాల మీదికి తెస్తోంది.  ధూమపానం చేసేవారి యువత  సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ధూమపానంతో వచ్చే వ్యాధులను తగ్గించు కునేందుకు వందల రెట్ల రూపాయలు అధికంగా ఖర్చు పెట్టినా పొగాకు పదార్థాల ప్యాకెట్లపై తేలుబొమ్మ, కాన్సర్ రోగిబొమ్మను ముద్రించినా, సిగరెట్ ధర ఎంత పెంచినా, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధించినా, చెల్లించక తప్పదు భారీ మూల్యం, ధూమపానం ప్రాణాంతకం  అని తెలిసినా సిగరెట్ అమ్మకాలు, పొగాకు ప్రియుల సంఖ్య మా త్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ప్రస్తుతం యువతలో విపరీతంగా పెరిగిపోతోంది. తమ ఆరోగ్యాన్ని తమే పాడుచేసుకుంటున్నామన్నా సోయి మరిచిపోయి,  పొగను రింగులు రింగులుగా వదులుతూ, వి లాసంగా సిగరెట్ కాలుస్తున్నానన్న భ్రమలో తేలియాడుతూ యువత తమ జీవితాన్ని చేజేతులా బూడిదచేసుకుం టున్నారు. ధూమపానం వల్ల వ్యక్తులలో నోటి కాన్సర్, దం తవ్యాధులు, ఉపిరితిత్తుల క్యాన్సర్, ఉదరకోశ వ్యాధులు, అల్సర్, గ్యాస్‌ట్రబుల్ సోకే అవకాశాలు ఎక్కువ. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా పిల్లల్లో ఆస్తమా రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. గుండెకు సంబంధించిన రక్త నాళా లు దెబ్బతిని రక్తపోటు, గుండెపోటు సంభవిస్తాయి. మెదడు లోని రక్తనాళాలు చిట్లి పక్షవాతం, నరాల బలహీనత ఏర్పడే ప్రమాదం ఉంది. పిల్లల్లో వినికిడి, మాట్లాడే  సమస్యలు తలెత్తుతాయి. ధూమపానం చేసేవారిండ్లలో ఉన్న పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి.

పొగతాగడం మానేయాలనే ఆలోచన వచ్చినా అమలు లో మాత్రం సాధ్యం కావడం లేదనే వారు ఎక్కువయ్యారు. ఒక చెడు మొక్కను నిర్మూలించాలని ఆకులు, కొమ్మలు, కాండాలను నరికి వేసినంత మాత్రానా చెడు మొక్క పూర్తిగా నశించదు. మరలా కొద్ది రోజులకు మళ్లీ మొలకెత్తుతుందనే విషయం మనకందరికీ తెలుసు. ఆ చెడు మొక్కను వేర్లతో సహా, నామరూపాలు లేకుండా పెకిలి వేసినపుడు మాత్రమే సాధ్యమవుతుంది. పొగతాగడం మానేయాలనుకోవడం మంచి నిర్ణయమే. పొగతాగడం మానేయాలనే ఆలోచనను ఆచరణలో పెట్టాలంటే మాత్రం తప్పకుండా ప్రణాళిక రూపొందించుకోవాలి. పొగ తాగే వ్యసనపరులందరికీ  ఒకే రకమైన  నియమాలు పనిచేయవనే  విషయాన్ని ముందుగా గుర్తించడం మంచిది. పొగతాగడాన్ని ఎందుకు మానేయా లనుకుంటున్నారో మిమ్నల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మీ బలాలు, బలహీనతలను తెలుసుకోండి. సిగరెట్ తాగడానికి మిమ్మల్ని ఏ పరిస్థితులు ప్రేరేపిస్తున్నాయో గమనించండి. సిగరెట్లు మానేయడం సులువే. పొగతాగడం మానివేసే సమయంలో ఉత్పన్నమయ్యే అసహనం, ఆందోళన వంటి లక్షణాలు అగుపిస్తాయి. వీటిని దృఢసంకల్పంతో,  ధీమాగా ఎదుర్కొవాలి. డ్యూక్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ధూమపానం చేసే ముందు ఒక గ్లాసు పాలు తాగడం మూలంగా సిగరెట్ రుచి పట్ల ఆసక్తి ఉండదు. సిగరెట్ ఆలోచన మనసుకు రాగానే, ముందుగా గ్లాసుపాలు తాగితే మంచి ఫలితముంటుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఒక అధ్యయనం లో వెల్లడైంది. నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ప్రకారం రోజులో కనీసం 35 మిల్లీగ్రాముల విటమిన్-సి తీసుకోవాలి. అయితే పొగాకు తినేవారిలో వచ్చే విటమిన్-సి లోపం కారణంగా గుండె జబ్బులు, కేన్సర్ బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారపదార్థా లు తీసుకుంటే పొగాకు వ్యసనం నుంచి బయటపడవచ్చు. విటమిన్ ఇ ఎక్కువగా తీసుకుంటే ధూమపానం వలన వచ్చే అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. తల్లిదండ్రులకు సిగరెట్ కాల్చడం ఒక అలవాటుగా ఉన్నట్లయితే యుక్తవయస్సులోని పిల్లలు కూడా అలవాటుగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులుగా బాధ్యత  తీసుకొని పిల్లల బంగారు భవిష్యత్తు కోసం సాధ్యమైనంత త్వరగా పొగతాగే అలవాటు మానుకోవాలి. ధూమపానం నిర్మూలన దిశగా కఠినమైన నిబంధనలను, నియమాలను నిర్దేశిస్తూ, చిన్న వయస్సులోనే ధూమపానా నికి అలవాటు పడటం మంచిది కాదని పిల్లలను హెచ్చరిస్తూ ఉండాలి. యుక్తవయసు పిల్లలకు ఎక్కువ సమయాన్ని కేటా యిస్తూ వారితో మాట్లాడుతూ వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. యుక్తవయసులో కొత్త అంశాల వైపుగా మొగ్గు చూపుతూ వాటి ఆకర్షణకు లోనవుతూ ఉంటారు. యువత ధూమపానం అలవాటును దూరం చేసుకోవడానికి సైకాల జిస్ట్ ద్వారా కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. లక్ష్యం వైపుగా పయనించడానికి కౌన్సెలింగ్ ద్వారా సాధించడం సులువవుతుంది.
 డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి 
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
9703935321

Tags

సంబంధిత వార్తలు