విమానంలో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

Updated By ManamTue, 05/22/2018 - 20:24
​​​​​​​Saudia flight, Jeddah airport, emergency landing
  • తలెత్తిన సాంకేతిక లోపం.. ల్యాండింగ్‌ గేర్‌ విఫలం

  • జెడ్డా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్..

​​​​​​​Saudia flight, Jeddah airport, emergency landingదుబాయ్‌: సౌదీ అరేబియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్‌ గేర్‌ పనిచేయకపోవడంతో విమానం ముందు భాగం ఒక్కసారిగా నేలను బలంగా ఢీకొట్టింది. దీంతో విమానంలో నుంచి మంటలు చెలరేగాయి. నిప్పులు చిమ్ముతున్న విమానాన్ని పైలెట్లు అతిజాగ్రత్తగా ల్యాండ్‌ చేశారు. ఈ ప్రమాదంలో విమానంలోని సిబ్బంది సహా 141 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 53 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మదీనా నుంచి ఢాకా వెళ్తున్న సౌదీఅరేబియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ330 విమానంలో సాంకేతికలోపం తలెత్తింది.

దాంతో జెడ్డా విమానాశ్రయంలో సోమవారం రాత్రి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ల్యాండింగ్‌ సమయంలో గేర్‌ పనిచేయడం మానేసింది. దాంతో విమానం ముందు భాగం బలంగా నేలను రాసుకుంటూ దూసుకెళ్లింది. విమానం ముందు భాగంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ ద్వారాల వద్ద నుంచి ప్రయాణికులను బయటకు పంపేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. విమానం ల్యాండ్‌ అవుతూ మంటలు చెలరేగడం ఈ వీడియోలో చూడవచ్చు.

English Title
Saudia flight makes emergency landing at Jeddah airport
Related News