దీపావళికి ‘సర్కార్’ 

Updated By ManamTue, 10/16/2018 - 01:23
Sarkar

imageతుపాకి, కత్తి చిత్రాల తర్వాత విజయ్, ఎ.ఆర్.మురగదాస్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కార్’. కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, కథానాయికలు. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో కళానిథి మారన్ నిర్మిస్తున్న చిత్రమిది. అశోక్ వల్లభనేని ఈ చిత్రం తెలుగు హక్కుల్ని ఫ్యాన్సీ రేట్‌కి సొంతం చేసుకున్నారు. ‘‘నవాబ్’లాంటి సూపర్‌హిట్ తర్వాత మురుగదాస్, విజయ్ సూపర్‌హిట్ కాంబినేషన్ మరో మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది.
తమిళంలో విడుదలైన ఫస్ట్‌లుక్‌కి, పాటలకు స్పందన అద్భుతంగా ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తాం. దీపావళి కానుకగా నవంబర్ 6న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం’’ అని అశోక్ వల్లభనేని చెప్పారు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

English Title
'Sarkar' to Diwali
Related News