‘అర్జున్ రెడ్డి’ అసిస్టెంట్‌తో సమంత సినిమా

Updated By ManamMon, 06/18/2018 - 11:37
Samantha To Make a Movie With Arjun Reddy Director Assistant

Samantha To Make a Movie With Arjun Reddy Director Assistantవరుస సక్సెస్‌లతో దూసుకుపోతోంది సమంత. పెళ్లయి అక్కినేని వారింట అడుగుపెట్టిన ఆమె.. చరణ్‌తో నటించిన రంగస్థలం మూవీతో భారీ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత తన రూట్ మార్చినట్టు కనిపిస్తోంది. వైవిధ్యభరితమైన కథలకే ఆమె మొగ్గుచూపుతోంది. ప్రస్తుతం థ్రిల్లర్ చిత్రం ‘యూ టర్న్’ రీమేక్‌లో నటిస్తున్న ఆమె.. ఆ తర్వాత మరో హీరోయిన్ ఒరియెంటెడ్ మూవీకీ సైన్ చేసినట్టు సమాచారం. అర్జున్ రెడ్డి ద‌ర్శకుడు సందీప్ రెడ్డి వంగా వ‌ద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన గిరి స‌య్యా ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది‌. హీరోయిన్ పాత్ర, సినిమా కథ నచ్చడంతో ఆ సినిమాను చేసేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆగస్టులో సినిమా సెట్స్‌పైకి వెళుతుందని అంటున్నారు. 

English Title
Samantha To Make a Movie With Arjun Reddy Director Assistant
Related News