కార్పొరేట్ పన్నును తగ్గించాల్సింది

Updated By ManamTue, 02/06/2018 - 15:43
Sajjan Jindal

Sajjan Jindalముంబయి: భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న అధిక పన్ను అంతర్జాతీయంగా అవి ఎక్కువ పోటీ ఇవ్వలేనివిగా తయారు చేస్తోందని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. కార్పొరేట్ ఆదాయ పన్ను రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి ఉండవలసిందని ఆయన సోమవారం ఇక్కడ బడ్జెట్‌ను విశ్లేషిస్తూ చెప్పారు. అంతర్జాతీయంగా అత్యధిక పన్ను రేట్లు ఉన్న దేశాలలో ఇండియా ఒకటిగా ఉందని భారీ కంపెనీలు హెచ్చు పన్నులు చెల్లిస్తూ, అంతర్జాతీయంగా ఎక్కువ పోటీ ఇవ్వలేకపోతున్నాయని ఆయన అన్నారు. సెక్యూరిటీల లావాదేవీ పన్నును తొలగించకుండా, కాస్ట్ ఇండెక్సేషన్ ప్రయోజనం కల్పించకుండా అమలులోకి తేవాలని భావిస్తున్న దీర్ఘకాల మూలధన లాభ పన్నును ప్రవేశపెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించుకోవాలని ఆయన కోరారు. ఇది దీర్ఘకాల ఇన్వెస్టర్లకు భారతీయ ఈక్విటీల పట్ల ఉన్న ఆకర్షణీయతను తగ్గిస్తుందని జిందాల్ అన్నారు.

  ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతలకు కేటాయించిన (క్రితంసారికన్నా 13 శాతం ఎక్కువగా) రూ. 1.38 లక్షల కోట్లు , మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించిన (కడపటిసారికన్నా 20 శాతం ఎక్కువగా) రూ. 5.97 లక్షల కోట్లు  భారత పౌరుల జీవన పరిస్థితులను మెరుగుపరచగలవని ఆయన చెప్పారు. మొత్తంమీద, దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు గ్రామీణ భారతావనికి బడ్జెట్ భారీగా రూ. 14.34 లక్షల కోట్లు కేటాయించిందని ఆయన అన్నారు. జి.డి.పి వృద్ధిలో నిలకడగా 8 శాతం పైన వృద్ధిని సాధించాలంటే, ఎగుమతులు చాలా ముఖ్యమని, ఎందుకంటే, భారతీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వినిమయంతో నడిచేదిగా లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం 3 వేల కోట్ల డాలర్లుగా ఉన్న వ్యవసాయ ఎగుమతులకు, వెయ్యి కోట్ల డాలర్ల ఎగుమతి సామర్థ్యం ఉందని ప్రభుత్వ అంచనా.  వ్యవసాయ ఎగుమతులను సరళీకరించడం ద్వారా అది అందుకు రోడ్ మ్యాప్‌ను సృష్టించింది. 

English Title
Sajjan Jindal bats for lower corporate tax
Related News