రషీద్‌ఖాన్, షాహిదీ అర్ధ శతకాలు

Updated By ManamThu, 09/20/2018 - 23:27
Rashid Khan, Shahidhi's half centuries
  • అఫ్ఘానిస్థాన్ 255/7

  • బంగ్లాదేశ్‌తో ఆసియా కప్ మ్యాచ్

imageదుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కో ల్పోయి 255 పరుగులు చేసిం ది. ఒక దశలో అఫ్గాన్ 200 పరుగులను కూడా దాటడం కష్టంగా కనిపించింది. కానీ మొదట హష్మతుల్లా (58) అర్ధ శతకంతో ఆదుకోగా.. చివర్లో రషీద్ ఖాన్ (57), గుల్బదీన్ నైబ్ (42) వేగంగా ఆడడంతో అఫ్ఘానిస్థాన్ పోరాడే స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచ గలిగింది. టాస్ గెలిచి బ్యాటిం గ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్‌కు ఆరం భం కలిసి రాలేదు. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

త ర్వాత ఓపెనర్ మహ్మద్ షహజాద్ (37), హష్మతుల్లా షాహిదీ (58; 92 బంతుల్లో 3 ఫోర్లు) ఆదుకున్నారు. ఆ తర్వాత మరింతగా పుంజు కున్న బంగ్లా బౌలర్లు వరుస క్రమంలో వికెట్లూ తీస్తూ అఫ్గాన్‌ను కట్ట డి చేశారు. దీంతో అఫ్గాన్ 160 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పీక ల్లోతు కష్టాల్లో పడింది. ఆసమయంలో క్రీజులోకి వచ్చిన యువ సంచలనం రషీద్ ఖాన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడారు. మరో వైపు చివరి వరకు అజేయంగా క్రీజులో ఉండి తమ జట్టును 50 ఓవ ర్లలో 255/7 పరుగుల పటిష్ఠ స్థితికి చేర్చారు.

దూకుడుగా ఆడిన రషీద్ 32 బంతుల్లోనే 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 57 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. మరోవైపు నైబ్ కూడా 38 బంతుల్లోనే అజేయంగా 42 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో షకీబుల్ హసన్ 4 వికెట్లు పడగొట్టగా.. అబూ హైదర్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. 

English Title
Rashid Khan, Shahidhi's half centuries
Related News