తలైవాతో....

Updated By ManamTue, 08/21/2018 - 01:33
thrisha

imageతలైవా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రజనీకాంత్ ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థపై సినిమా నిర్మితమవుతుంది. ఈ సినిమాలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష నటిస్తుందని వార్తలు కొన్ని రోజులుగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ త్రిష నటించనుందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రజనీకాంత్‌తో నటించాలని  వేచి చూస్తున్న త్రిష అవకాశం రాగానే ఏ మాత్రం ఆలోచించకుండా డేట్స్ కేటాయించేసిందట. ఈ సినిమాతో కలిపి త్రిష అరడజను సినిమాలో ఫుల్ బిజీగా ఉంది మరి. 

English Title
with rajanikanth
Related News