డబుల్ షేడ్‌లో రజనీ

Updated By ManamSat, 07/21/2018 - 23:50
rajani

imageరజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో పాటు సిమ్రాన్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర రెండు షేడ్స్‌తో ఉంటుందని తెలుస్తోంది. అందులో ఒకటి హాస్టల్ వార్డెన్ పాత్ర అయితే.. మరో షేడ్‌లో డాన్‌గా రజనీ కనిపిస్తారు. ఆసక్తికరమైన విషయమేమంటే వార్డెన్‌గా పగటి సమయంలో.. డాన్‌గా రాత్రి సమయాల్లో రజనీ కనపడతారట. 

English Title
rajani in double shade
Related News