ప్రొ హరగోపాల్ అరెస్ట్.. ఉద్రిక్తత!

Updated By ManamFri, 09/14/2018 - 18:13
Gun Park, Professor Haragopal, Corporate schools, Private Colleges
  • కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లను వ్యతిరేకించిన విద్యావేత్తలు 

  • గన్‌పార్క్ వద్ద సమావేశం.. అడ్డుకున్న పోలీసులు

Gun Park, Professor Haragopal, Corporate schools, Private Collegesహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్న విద్యావేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ‘ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను బ్రతికిచుకుందాం, విశ్వవిద్యాలయలను కాపాడుకుందాం’ అనే నినాదంతో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ గన్‌పార్క్ వద్ద శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు.

రంగంలోకి దిగిన పోలీసులు సమావేశాన్ని అడ్డుకున్నారు. కార్పోరేట్ పాఠశాలలను, కళాశాలలను స్వాధీనం చేసుకోవాలని, ప్రయివేటు పాఠశాల లను, కళాశాల లను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్న విద్యా వేత్తలను పోలీసులు విచక్షణ రహితంగా అరెస్టు చేశారు. సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్‌ చొక్కా పట్టుకుని తీసుకెళ్లి పోలీసు జీపు ఎక్కించారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసుల చర్యపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. పోలీసుల చర్యపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. 
Gun Park, Professor Haragopal, Corporate schools, Private Colleges
Gun Park, Professor Haragopal, Corporate schools, Private Colleges
 

English Title
Professor Haragopal arrested by police at Gun park
Related News