పేదల పెన్నిధి

Updated By ManamMon, 10/22/2018 - 07:59
SR Sankaran

image‘ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలి స్తుంది. లక్షలాది మంది కదలిక సమాజాన్ని సమూలంగా మారుస్తుం’దని పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత మాజీ ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్ మాటలు నేడు అక్షర సత్యాలు దాల్చుతున్నాయి. తన మంచి ఆలోచనతో ఒక ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలల్లో పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాకు శ్రీకారం చుట్టి వాటిని తూచ తప్పకుండా అమలు చేయ డం ద్వారా రెండు రాష్ట్రాల్లోని లక్షలాది మంది నిరుపేదలు సంక్షేమ ఫలాలు సద్వినియోగం చే సుకున్నారు. ప్రస్తుతం ఆయా కుటుంబాలు వెలుగుబాటలో పయణిస్తున్నాయి. ఎస్‌ఆర్ శంకరన్ తమిళనాడులో మధ్యతర గతి బ్రాహ్మణ కుటుంబంలో 1934 అక్టోబర్ 22న జన్మించారు. మద్రాసు లయోలా కళాశా లలో హయ్యర్ సెకండరీ విద్యను పూర్తిచేసి అదే కళా శాలలో డిగ్రీ చదివారు. 1957లో ఇండి యన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసేస్‌కు ఎంపిక య్యారు. 1992 అక్టోబర్‌లో పదవీ విరమణ చేసి 2010 అక్టోబర్ 7న తుదిశ్వాస విడిచారు. తన 76 సంవత్సరాల జీవితకాలంలో సుమారు 43 సంవత్సరాల పాటు పేదల అభివృద్ధే లక్ష్యం గా పనిచేశారు. 1959లో కర్నూలు జిల్లా నం ద్యాలలో సబ్ కలెక్టర్‌గా తన అధికారిక జీవి తాన్ని ప్రారంభించిన శంకరన్ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, తదనంతరం అదే జిల్లా కలెక్టర్‌గా రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా, ప్రిన్సిపాల్ సెక్రెటరిగా, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి గానే కాకుండా జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖలో కార్యదర్శిగా పని చేశారు. దేశ చరిత్ర లో బహుశా శంకరన్ లాంటి అధికారులను అరుదుగా చూస్తుంటాం.  బ్రాహ్మణ కుటుంబం లో పుట్టినప్పటికినీ తన ఆలోచన విధానం అంత కూడా బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యన్నతి కోసమే పరితపించేవారు.

శంకరన్ సాంషిక సంక్షేమ కార్యదర్శిగా ఉన్నప్పుడు 1970లో ఊరూరా తిరుగుతూ అనేక సంవత్సరాలుగా గ్రామాల్లో వెట్టిచాకిరి చేస్తూ బానిస బతుకులు బతుకుతున్న దళిత, గిరిజనులను కలిసి వారి హక్కుల గూర్చి వివ రించి చైతన్య పరిచిన వ్యక్తి శంకరన్. నాటి ముఖ్య మంత్రి మర్రి చెన్నారెడ్డి శంకరన్ లాంటి అధి కారులు తన ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదని తన అహంకారాన్ని బయట పెట్టారు. కానీ శంకరన్ తనదైన శైలిలో పేదల పక్షాన నిలబడి పనిచేయలేని చెన్నారెడ్డి ప్రభు త్వంలో తాను పని చేయలేనని దీర్ఘకాలికంగా కొన్ని నెలలపాటు సెలవు పెట్టారు. అప్పటికే శంకరన్ పేరు దేశ నలు మూలల వ్యాపిం చింది. నాటి త్రిపుర ముఖ్య మంత్రి నృపేన్ చక్రవర్తి పేదల సంక్షేమం కోసం పరితపిస్తున్న శంకరన్‌ని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా నియమించుకున్నారు. ఆ ఇద్దరు పేదల సం క్షేమం వైపు ఆలోచించే వ్యక్తులు కావడం వల్ల త్రిపుర రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయగలి గారు. దాదాపు ఆరు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించగలి గారు. ఆ ఇద్దరు అనేక గిరిజన గ్రామాల్లో పర్యటించి నేరుగా ఆ ప్రజలతో మమేకమై వారి కష్టసుఖా లల్లో పాలుపంచుకుని వారి ఇబ్బందులను నేరుగా గుర్తించ గలిగారు. ఆ దిశగానే వారికి ఉపయోగపడే నూతన సంక్షేమ కార్యక్ర మా లకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో 1984లో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదనంతరం శంకర్‌ని ఆహ్వనించి తన ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్య దర్శిగా నియమించుకున్నారు. త్రిపుర రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మాది రిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా పేద ప్రజల అభ్యు న్నతికి పాటుపడ్డారు శంకరన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రతి పౌరునికి తిండి, బట్ట, గూడు అలాగే విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. పేదవర్గాల పిల్లలు సరైన పౌష్టికా హారం, తిండి లేక అనారోగ్యం పాలైపిట్టల్లా రాలిపోతున్న సమయం. ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది. దానిని గమనించిన శంకరన్ సంక్షేమ విద్యా లయాల స్థాపనకు శ్రీకారం చుట్టారు. దళిత గిరిజన విద్యార్థుల కోసం 1984లో సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేశారు.  ఎస్ ఆర్ శంకరన్ కలలు కన్న ఆశయాలు నెర వేరనున్నాయి.
 దొమ్మాటి అనిత
ఉపాధ్యాయురాలు
(నేడు శంకరన్ జయంతి)

English Title
The poor is great
Related News