'ఆఫీస‌ర్‌'.. 'న‌వ్వే నువ్వు' వీడియో సాంగ్‌

Updated By ManamTue, 05/22/2018 - 16:25
rgvT

rgvకింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా సంచ‌లన ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ రూపొందించిన చిత్రం 'ఆఫీస‌ర్‌'. క‌ర్ణాట‌కకు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ కె.ఎం.ప్ర‌స‌న్న జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మైరా స‌రీన్ క‌థానాయిక‌గా న‌టించింది. జూన్ 1న ఈ సినిమా తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే.. ర‌విశంక‌ర్ సంగీత సార‌థ్యంలో రూపొందిన 'న‌వ్వే నువ్వు' అంటూ సాగే పాట తాలుకూ వీడియో సాంగ్ ప్రోమోని ఈ రోజు (మంగ‌ళ‌వారం) విడుద‌ల చేశారు. సిరాశ్రీ రచించిన ఈ పాట‌ను ర‌మ్య బెహ‌రా గానం చేశారు. తండ్రీ కూతుళ్ళ అనుబంధం నేప‌థ్యంలో రూపొందిన ఈ పాట తాలుకూ పూర్తి వీడియో చూడాలంటే సినిమా విడుద‌ల తేది వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే.. రేపు (బుధ‌వారం) ఈ పాట తాలుకూ లిరిక‌ల్ వీడియో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

English Title
'officer'.. 'navve nuvve' video song
Related News