ఢిల్లీలో ఒడిశా రచయిత అరెస్టు

Updated By ManamThu, 09/20/2018 - 22:44
abhijith
  • ఒడిశా అసెంబ్లీలో హక్కుల తీర్మానం

  • ఆ రాష్ట్రంలోనే కేసు కూడా నమోదు

  • ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదన్న లాయర్

abhijithన్యూఢిల్లీ: ప్రముఖ రచయిత, రక్షణ రంగ నిపుణుడు అభిజిత్ అయ్యర్ మిత్రాను ఒడిశా పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. ఆయనను నిజాముద్దీన్ ప్రాంతంలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అరెస్టు చేశారు. ఆయనపై ఒడిశాలో కేసు నమోదై నట్లు వారు చెప్పారని అయ్యర్ మిత్రా తరఫు న్యాయవాది తెలిపారు. ఒడిశా అసెంబ్లీలో అయ్యర్ మిత్రాపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలోనే దేశ రాజధానిలో ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. ఒడిశా ఎమ్మెల్యేలు లక్ష్యంగా, వారి పరువుకు భంగం వాటి ల్లేలా ఆయన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను సభకు పిలి పించాలని ఒడిశా ప్రతిపక్ష నేత నరసింఘ మిశ్రా సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు.అయ్యర్-మిత్రా పేరు సోమవారం కూడా అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిది. కోణార్క్‌లోని సూర్యదేవాలయం గురించి, పూరీ జగన్నాథుడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ అధికార పార్టీ బిజూ జనతాదళ్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మిత్రాపై ఆరోపణలు చేశారు. ఈనెల 16వ తేదీన అయ్యర్-మిత్రా ట్విట్టర్‌లో కొన్ని వ్యాఖ్యలు చేయడంతో పాటు కోణార్క్ ఆలయం గురించి ఒక వీడియో కామెంట్రీ కూడా పెట్టారు. అందులో ‘‘కోణార్క్ ఆలయం నుంచి మీకు నా ప్రత్యేక సందేశం. హిందూ నాగరికతకు వ్యతి రేకంగా ఈ సువిశాల కుట్రపై నా చికాకును ఈ సందేశంలో ప్రదర్శి స్తున్నా’’ అని తెలిపారు. అయితే, తనపై ఒడిశాలో నమోదు అయ్యిందం టున్న ఫిర్యాదు కాపీని మాత్రం తనకు ఇవ్వలేదని అయ్యర్ మిత్రా న్యాయవాది మీడియాకు చెప్పారు. ఆయనను రిమాండు కోసం సాకేత్ కోర్టుకు తీసుకెళ్లారని, దాన్ని తాము వ్యతిరేకిస్తామని అన్నారు. తమకు కనీసం ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా ఇవ్వ లేదని.. దాంతో అసలు ఫిర్యాదు ఎవరు చేశారో, తాము ఏం తప్పులు చేశామో, అలాగే ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో కూడా తెలియడం లేదని అన్నారు. అభిజిత్ అయ్యర్- మిత్రా పలు పత్రికలలో తన అభి ప్రాయాలను వ్యాసాల రూపంలో రాస్తుంటారు. ముఖ్యంగా రక్షణ సంబం దిత అంశాలపై రాస్తారు. దాంతో పాటు ఆయన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ స్టడీస్‌లో సీనియర్ ఫెలోగా కూడా ఉన్నారు.

Tags
English Title
Odisha author arrested in Delhi
Related News