'సీట్ల సర్దుబాటు ఇంకా ఫైనల్ కాలేదు'

Updated By ManamFri, 11/09/2018 - 18:04
Kodanda Ram, Seats Adjustment, Telangana assembly elections, TRS party

Kodanda Ram, Seats Adjustment, Telangana assembly elections, TRS partyహైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికలు సమీస్తున్న వేళ.. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారంతో జనంలోకి వెళ్తుంటే.. మరోవైపు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాక భాగస్వామ్య పార్టీల నుంచి అసమ్మతి సెగ భగ్గుమంటోంది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై 74 మంది అభ్యర్థులను ఢిల్లీలో గురువారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీకి 14 స్థానాలు, 8 టీజేఎస్, సీపీఐకి 3 స్థానాలు కేటాయించింది. అయితే తమకు 3 సీట్లు మాత్రమే కేటాయించడంపై సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం టీజేఎస్ అధినేత కోదండరాం మాట్లాడుతూ.. మహాకూటమిలో సీట్లు సర్దుబాటు ఇంకా ఫైనల్ కాలేదన్నారు. కేటాయించే స్థానాలపై కాలయాపన చేయకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కాంగ్రెస్‌ను కోరారు. సీపీఐ చేసిన సూచనలపై తాము ఆలోచిస్తున్నట్టు తెలిపారు. సీపీఐ విషయంలో కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేశారు. 

English Title
No final decision on Seats adjustment, says Kodanda ram 
Related News