బాలికలే కాదు.. బాలురినీ వదిలిపెట్టరు!

Updated By ManamWed, 08/15/2018 - 19:20
1,000 children molested, hundreds of Catholic priests, Pennsylvania

1,000 children molested, hundreds of Catholic priests, Pennsylvaniaచిన్నారులు, మ‌హిళ‌ల‌పై వేధింపులు అంత‌టా స‌ర్వ‌సాధార‌ణ‌మ‌యి పోయింది. తాజాగా వెలుగులోకి వ‌చ్చిన మ‌రో ఘ‌ట‌న అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇది జ‌రిగింది. ఈస్టేట్‌లోని రోమ‌న్ క్యాథ‌లిక్ ఆరు డ‌యాసిస్‌ల ప‌రిధిలో ప‌నిచేసే బోధ‌కులు(ప్రీస్ట్‌లు) గ‌త ద‌శాబ్దంకాలంగా వేలాది మంది బాల‌ల‌పై లైంగిక‌దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు వెల్ల‌డ‌యింది. 1950ల నుంచి జ‌రుగుతున్న ఈ పైశాచిక క్రీడ‌తో300 మందికిపైగా బోధ‌కుల‌కు సంబంధం ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. అయితే, బాధితుల సంఖ్య‌ను ప్ర‌స్తుతానికి 1,500గా గుర్తించారు.  చాలా చోట్ల రికార్డులు క‌నిపించ‌కుండా చేశారు.  చాలామంది తాముప‌డిన వేద‌న‌ను చెప్పుకునేందుకు ముందుకురావ‌డం లేదంటున్నారు. వాస్త‌వ సంఖ్య వేల‌ల్లోనే ఉంటుంద‌ని స‌మాచారం. పెన్సిల్వేనియా అటార్నీజ‌న‌ర‌ల్ రెండేళ్ల‌పాటు జ‌రిపిన ద‌ర్యాప్తును బ‌య‌ట‌కు పొక్క‌కుండా చేసేందుకు చ‌ర్చి సీనియ‌ర్ అధికారుల‌తోపాటు వాటిక‌న్ సిటీ ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం ప‌నిచేస్తున్నాయ‌ని ఆరోపిస్తున్నారు.

బాధితుల్లో బాలిక‌ల‌తోపాటు ఎక్కుమంది బాలురే ఉన్నారు. వీరిని మ‌తాధికారులు కొట్ట‌డం, ర‌క‌ర‌కాల లైంగిక వాంఛ‌లు తీర్చుకునేందుకు వాడుకున్నార‌ని తేలింది. లైంగిక‌దాడి, వేధింపుల అనంత‌రం బాధితుల‌తో ప‌శ్చాత్తాప ప్ర‌క‌ట‌న‌లు చేయించేవారని రుజువ‌యింది. దీనికి సంబంధించి ప‌లువురు సీనియ‌ర్ మ‌తాధికారుల‌పైనా ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కార్డిన‌ల్థియోడ‌ర్ మెక్‌కిర్క్‌(88)ను ప‌ద‌వి నుంచిత‌ప్పించారు. అనేక సంవ‌త్స‌రాల‌ పాటు ఈయ‌న బాల‌ల‌పై వేధింపులు, లైంగిక దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు అభియోగాలున్నాయి. ఈయ‌న త‌ర్వాత ఆ ప‌ద‌విలోకి వ‌చ్చిన అధికారిపైనా ప‌లుకేసులున్నాయి. వీటిపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన గ్రాండ్జ్యూరీ స‌వివ‌ర నివేదిక రూపొందించింది. అయితే, త‌మ పేరు ప్ర‌తిష్ట‌లు దెబ్బ‌తింటాయ‌ని, చ‌ర్చిఇమేజి మ‌స‌క‌బారుతుంద‌ని ఆ నివేదిక‌ను వెలుగులోకి రాకుండా ప్ర‌య‌త్నాలు తెర‌వెనుక సాగుతున్నాయి. ఈ ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వాల‌నీ, ఎటువంటి రుజువులు లేవ‌ని మ‌త పెద్ద‌లు కొట్టిపారేస్తున్నారు.

English Title
More than 1,000 children molested by hundreds of Catholic priests in Pennsylvania, says report
Related News