కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో మార్కెట్లు

stock market
  • ఆటుపోట్ల నడుమ సాగిన మార్కెట్లకు లాభాలు తెచ్చిన కొనుగోళ్లు

  • ధరలు పెరగటంతో టాప్ లూజర్స్‌గా ఆయిల్ రంగ షేర్లు

  • ఒక దశలో మార్కెట్లనూ నష్టాల వైపు ట్రేడింగ్

  • 232 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 36,212 వద్ద ముగింపు

  • 53 పాయిట్ల లాభంతో 10,800 మార్క్ దాటిన నిఫ్టీ

  • లాభాలకు అవరోధాలుగా రూపాయి క్షీణత, చమురు ధరల పెరుగుగదల

ముంబై: వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ద బయాలు తొలగుతాయనే సంకేతాలతో లాభాలకు బాటలు వేసినట్లయిందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. కాగా, సెషన్ ప్రారంభం నుంచి మందకోడిగానే మార్కెట్లు సాగినప్పటికీ సెషన్ ముగిసే సమయానిని గంట ముందు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో లాభాలు తిరిగి లాభాలు నమోదు చేశాయి. బుధవారంనాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 232 పాయింట్ల లాభంతో 36,212 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 10,855 వద్ద ముగిశాయి. నిఫ్టీ ఇంట్రాడేలో 10,749-10,870 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 35,863 పాయింట్ల కనిష్ట స్థాయిని, 36,250 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి లార్జ్‌క్యాప్ షేర్లు పెరగడం, అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ల లాభాలు వంటి అంశాలు మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి క్షీణత, ముడి చమురు ధరల పెరుగుదల వల్ల మార్కెట్ ఒకానొక సమయంలో నష్టాల్లోకి కూడా వెళ్లింది. అయితే చివరి గంటలో కొనుగోలు జోరందుకోవడంతో ఇండెక్స్‌లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. నిఫ్టీ 50లో యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. అదేసమయంలో హెచ్‌పీసీఎల్, గెయిల్, బీపీసీఎల్, యస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ రంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్, గెయిల్ షేర్ల 4 శాతం మేర పడిపోయాయి. గెయినర్లలో యాక్సిస్ బ్యాంక్ ఎక్కువగా 3 శాతానికి పైగా లాభపడింది. బ్లాక్ డీల్స్ కారణంగా యస్ బ్యాంక్ షేరు నష్టపోయింది. యూరప్‌లో ఉత్పత్తి తగ్గిందని, దీని వల్ల మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని టాటా స్టీల్ ప్రకటించడంతో కంపెనీ షేరు ధర 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్‌లు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ గరిష్టంగా 1 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మీడియా ఇండెక్స్‌లు కూడా నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 1 శాతానికి పైగా పెరిగింది.

సంబంధిత వార్తలు