లేచిన వేళ బాగుంది.. మృత్యువు అంచుల్లోకి..!

Updated By ManamWed, 05/23/2018 - 15:59
​​​​​​​Man crossing, Delhi Metro station, ucky escape

​​​​​​​Man crossing, Delhi Metro station, ucky escapeన్యూఢిల్లీ: లేచిన వేళ బాగున్నట్టుంది.. మృత్యువు అంచుల్లోకి వెళ్లి యమధర్మరాజుకు హాయ్ చెప్పి వచ్చాడు. లేదంటే క్షణాల్లో ఆ యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అదృష్టవశాత్తూ అతడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. 21ఏళ్ల మయూర్ పటేల్ అనే యువకుడు మెట్రో రైలు ప్లాట్‌ఫాంపై నుంచి పక్క ప్లాట్‌ఫాంపైకి వెళ్లేందుకు ట్రాక్‌ను దాటుతున్నాడు. అదే ట్రాక్‌పై కదిలేందుకు మెట్రోరైలు సిద్ధమవుతోంది. ఇంతలో యువకుడు మయూర్ ట్రాక్‌ను దాటి ప్లాట్‌ఫాంపైకి ఎక్కేందుకు యత్నించాడు. అదేసమయంలో మెట్రోరైలు నెమ్మదిగా కదులుతుండగా ముందుభాగం అంచుకు తగిలి పట్టుతప్పి మళ్లీ ట్రాక్‌పై జారిపడ్డాడు. . క్షణాల్లో లోకో పైలట్ అప్రమత్తమై వెంటనే రైలుకు బ్రేక్ వేయడంతో మయూర్‌కు ప్రాణపాయం తప్పింది. ఈ ఘటన ఢిల్లీలోని శాస్త్రి నగర్ మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకుంది.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటన అనంతరం రైల్వే అధికారులు పటేల్‌‌ను ట్రాక్‌పై ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారు. అందుకు అతడు మరో ప్లాట్‌ఫాంకి వెళ్లేందుకు తనకు దారి తెలియక ఇలా ట్రాక్‌పై నుంచి దాటేందుకు యత్నించినట్టు చెప్పాడు. దాంతో ఢిల్లీ మెట్రో అధికారులు మయూర్‌కు జరిమానా విధించారు. కాగా, అనుమతి లేకుండా మెట్రో రైలు ట్రాక్‌లపై నడవడం చట్టం రీత్యా నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడినవారికి సంబంధిత అధికారులు రూ.500 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంది. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

English Title
Man crossing tracks in Delhi Metro station has lucky escape
Related News