'మ‌హాన‌టి'.. 12 రోజుల‌ క‌లెక్ష‌న్స్‌

Updated By ManamMon, 05/21/2018 - 20:02
mahanati

mahanatiఅభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా 'మ‌హాన‌టి'. కీర్తి సురేశ్, స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రియాంక ద‌త్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజు నుంచే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. విడుద‌లైన ప్ర‌తి చోటా మంచి వ‌సూళ్ళు రాబ‌డుతోంది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం.. 12 రోజుల‌కిగానూ (ఆదివారం నాటికి) తెలుగు రాష్ట్రాల్లో రూ.17.32 కోట్ల షేర్ రాబ‌ట్టుకున్న ఈ సినిమా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.29.12 కోట్ల షేర్ ఆర్జించింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే లాభాల బాట ప‌ట్టిన ఈ సినిమా.. బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతోంది.

English Title
'mahanati' 12 days collections
Related News