తెలంగాణ ఎన్నికలపై లగడపాటి సర్వే

Telangana elections, Lagadapati Rajagopal survey, TRS, TDP, Congress
  • టీఆర్ఎస్‌కు 35 స్థానాలు.. ప్రజాకూటమికి 65 స్థానాలు

  • ఇండిపెండెంట్లు 7 స్థానాలు.. ఎంఐఎం 6 నుంచి 7 స్థానాలు

  • టీడీపీ 7 స్థానాలు.. సీపీఎం ఒక స్థానం.. బీఎల్ఎఫ్ ఒక స్థానం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఎగ్జిట్ పోల్ సర్వేను వెల్లడించారు. శుక్రవారం సాయత్రం 7 గంటలకు మీడియాతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకూ సర్వే చేసినట్టు తెలిపారు. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందన్నారు. ఇండిపెండెంట్లు ఏడుగురు గెలుస్తారని చెప్పారు. అలాగే ప్రలోభాలు ఉన్నాయి కాబట్టి సంఖ్య అటు ఇటు ఉండొచ్చని తెలిపారు. టీడీపీ 7 స్థానాల్లో గెలవబోతుందన్నారు.

టీఆర్ఎస్-టీడీపీ పోటీ ఉన్న స్థానాలు 12 ఉన్నాయని, అందులో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుస్తారని లగడపాటి వెల్లడించారు. ప్రజాకూటమికి 65 స్థానాలు రాబోతున్నాయని, టీఆర్ఎస్ పార్టీ 35 స్థానాల్లో గెలవబోతుందని లగడపాటి జోస్యం చెప్పారు. సీపీఎంకు ఒక స్థానం, ఎంఐఎంకు 6 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. బీఎల్ఎఫ్ ఖమ్మం జిల్లాలో ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని లగడపాటి తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్‌కు, ఎంఐఎంకు పది స్థానాలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చునని అంచనా వేస్తున్నట్టు లగడపాటి పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు