వీడియో: అత్త పూలు కోసిందని కోడలి పైశాచికత్వం..!

Updated By ManamThu, 05/31/2018 - 12:32
Kolkata: Woman beats mother-in-law for plucking flowers, video goes viral

Kolkata: Woman beats mother-in-law for plucking flowers, video goes viralకోల్‌కతా: వృద్ధురాలనే కనికరం లేకుండా అత్తను  పైశాచికంగా వేధించిందో కోడలు. ఇంతకీ ఆ అత్త చేసిన తప్పు ఏమిటంటే.. కోడలికి చెప్పకుండా పెరట్లోని పువ్వులు కోయడమే. ఇంత చిన్నదానికే కోడలు పెద్ద రాదంతం చేస్తూ అత్తను చిత్రహింసలకు గురిచేసింది. అత్తను కోడలు కొడుతుండగా పక్కంటి వ్యక్తి తన ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. కోడలు పెట్టే హింసను తట్టుకోలేని ఆ ముదుసలి అత్త.. కనీసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కూడా కోడలిపై ఫిర్యాదు చేయలేని పరిస్థితి. సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్టు చేసిన కొద్దిగంటల్లోనే వైరల్ అయి చివరికి బన్స్‌ద్రోణి పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెలుగులోకి వచ్చింది.

5లక్షలకు పైగా వ్యూస్.. 8వేలకుపైగా లైకులు.. 25వేల షేర్లు..
ఇప్పటివరకూ ఈ వీడియోకు మొత్తం 5,03,000 వ్యూస్ రాగా, 8,300 లైకులు, 25,000 షేర్లు అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన బన్స్‌ద్రోణి పోలీసు అధికారి సుబ్ర చక్రవర్తి చర్యలు చేపట్టారు. రంత్ సేన్‌గుప్తా అనే వ్యక్తి ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి ఈ వీడియో పోస్టు అయినట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే సేన్‌గుప్తా ఇంటికి వెళ్లి పోలీసులు ఆరా తీశారు. చివరికి ఈ వీడియో ఓ వైద్యుని నుంచి తనకు వచ్చినట్టు తెలిపాడు. అనంతరం ఆ వైద్యుని ఇంటికి పోలీసులు వెళ్లగా.. కోల్‌కతాలోని ఓ వైద్య ప్రతినిధి తనకు ఈ వీడియోను పంపారని, గారియాలోని పంచనంతలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు వైద్యుడు పోలీసులకు తెలిపాడు.

బాధితురాలిని గుర్తించిన పోలీసులు
వైరల్‌గా మారిన ఈ వీడియోను అక్కడి స్థానికులకు పోలీసులు చూపించడంతో బాధితురాలి సమాచారాన్ని అందించారు. బోరల్ ఉత్తరపరలో నివాసముంటున్న వృద్ధురాలు జాసోడా పాల్ (75)గా పోలీసులు గుర్తించారు. నిందితురాలు రంజిత్ పాల్ భార్య స్వప్న పాల్ (40)గా గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి మతిమరుపు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు అత్తను చిత్రహింసలు పెడుతున్న కోడల్ని తిట్టిపోస్తున్నారు. ఇదే ఆ వీడియో..

English Title
Kolkata: Woman beats mother-in-law for plucking flowers, video goes viral
Related News