త్వరలోనే బ్యాట్‌ పట్టి ఆడేస్తా..

Updated By ManamSun, 07/22/2018 - 10:52
kedar jadhav
Kedar Jadhav

మరో రెండు వారాల్లో బ్యాట్‌ పట్టేస్తా అంటున్నాడు ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌. ఈ ఏడాది ఐపీఎల్‌లో కేదార్‌ జాదవ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. టోర్నీలో భాగంగా ముంబయి ఇండియన్స్‌ తో ఆడిన తొలిమ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత వైద్యుల సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనుకున్న దానికంటే త్వరగానే కోలుకుంటున్నానని, రెండు,మూడు వారాల్లో బ్యాట్‌ పట్టుకుని ఆడేస్తానని ధీమాగా చెబుతున్నాడు.

‘బాగానే  కోలుకుంటున్నాను. రెండు మూడు వారాల్లో ఫిట్‌ గా తయారై క్రికెట్‌ ఆడటం మొదలుపెడతాను. బ్యాట్‌ పట్టుకుని ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను కానీ వర్షం వల్ల సరిగా ఆడలేకపోతున్నాను. అనుకున్నదానికంటే వేగంగా కోలుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఇదే గాయంతో గతంలో రెండుసార్లు గాయపడ్డాను. మొదటిసారి ధర్మశాలలో శ్రీలంకతో మ్యాచ్‌లో గాయపడ్డాను. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో, తర్వాత ఐపీఎల్‌లో. తరచూ అదే గాయం బాధిస్తోండటంతో ఫియోలు, డాక్టర్లు శస్త్రచికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో  మెల్‌బోర్న్‌ వెళ్లి ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఈ మూడు నెలలు నాకు ఎంతో కఠినంగా గడిచాయి. 

కానీ, ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ ఎంత అవసరమో తెలిసివచ్చింది. గాయాలు ఆటలో భాగం. దానికి ఏం చేయలేం. రెండు మూడు నెలల్లో మాత్రం పూర్తిస్థాయిలో బ్యాట్‌ పట్టి ఆడేస్తా’ అని కేదార్‌ తెలిపాడు. నాకు ఎప్పుడు కోహ్లీ మద్దతు ఉంటుంది. ఇప్పుడనే కాదు నేను మొదటిసారి జట్టులో చేరినప్పటి నుంచి కోహ్లీ నాకు ఎంతో మద్దతుగా నిలిచాడు. నేను మొదటిసారి టీమిండియాకు ఎంపికైనపుడు కోహ్లీ నాకు బ్లాక్‌ బెర్రీ ఫోన్‌ కానుకగా ఇచ్చాడు. కెప్టెన్‌గా కోహ్లీ యువ ఆటగాళ్లను ఎప్పుడూ ప్రోత్సహిస్తాడు అని జాదవ్‌ తెలిపాడు.

English Title
Kedar Jadhav is ready to playing in two to three weeks 
Related News