దానిపై నేను కామెంట్ చేయలేను: కమల్

Updated By ManamMon, 10/15/2018 - 13:01
Kamal Haasan

Kamal Haasanచెన్నై: ప్రముఖ అయ్యప్పస్వామి ఆలయం శబరిమలలో మహిళలకు అనుమతినిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల చారిత్రాత్మక తీర్పును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుపై కొన్ని మహిళా సంఘాలతో పాటు పలు అయ్యప్ప సంఘాలు భగ్గుమంటున్నాయి.

ఈ తీర్పును పున:పరిశీలించాలంటూ ఆ సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ వివాదంపై ఉలగనాయగన్, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ స్పందించారు. ‘‘ఇది భక్తులకు, సుప్రీం కోర్టుకు మధ్య సంబంధించిన విషయం. నేను కేవలం చూసేవాడిని మాత్రమే. ఈ వివాదంపై తాను ఎలాంటి కామెంట్ చేయనని.. అలాగని నో కామెంట్ అని కూడా చెప్పను’’ అంటూ చెప్పుకొచ్చారు కమల్ హాసన్.

English Title
Kamal Haasan on Sabarimala Verdict
Related News