కార్పొరేట్ల కాపరి!

Updated By ManamThu, 07/12/2018 - 00:55
image

imageఇటీవల స్విస్‌బ్యాంక్ యాజమాన్యం తమ బ్యాంకులో డిపాజిట్లు అభివృద్ధి శాతాన్ని ప్రకటిం చింది. అందులో భారత్ డిపాజిట్లు ఈ ఏడాది 50 శాతం పెరిగాయి. దేశీయ బ్యాంకుల్లో డిపాజిట్లు లేక భారత బ్యాంకుల దివాలా స్థితిలో ఉండగా, స్విస్ బ్యాంకులో మనదేశ ఖాతాదారులు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా నల్లధనాన్ని పెంచారు. ఇందు కు గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా కారణమనే భావించాలి. స్వదేశీ నినాదం, అవినీతి రహిత పాలన, స్విస్‌బ్యాంక్‌లోని నల్లకుబేరుల డబ్బును భారత్‌కు రప్పించి ప్రజలకు పంచుతామని, యేటా కోటి ఉద్యోగాల కల్పన నినాదాలు నరేంద్ర మోదీని అధికారం లోకి తెచ్చాయి.

సుదీర్ఘకాలం కాంగ్రెస్‌పార్టీ, దాని నేతృత్వంలోని ఐక్య సంఘటన ప్రభుత్వాల విధానాలపై ప్రజలు విసుగుచెందడం కూడా మరో కారణం. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏకు అంత మెజారిటీ రావడానికి గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే కారణమని చెప్పవచ్చు. కాంగ్రెస్, దాని ఐక్య సంఘటన (యూపీఏ) ప్రభుత్వాల విధానాలను తలదన్నే విధంగా ఎన్‌డీఏ ప్రభుత్వ తీరుంటుందని దేశ ప్రజానీకం భావించి అధికారం కట్టబెట్టగా గత ప్రభుత్వాలకంటే ప్రజాజీవనాన్ని మరింత అధ్వానైమెన రీతిలో సంక్షోభంలోకి నెట్టింది. అధికారంలోకి రాకముందు 2014 జనవరి 9న మోదీని ఎన్‌డీఏ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంలో దేశంలోని బడా పెట్టుబడిదారుల, బహుళ జాతి సంస్థల ప్రయోజనాలు దాగివున్నాయి. ప్రజాకర్షక పథకాలు ప్రకటించడంలో కేం ద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ను మించిన రాజకీయనాయకులు లేరు. అధికారాన్ని స్థిరపరచుకోవడానికి ఎంతటి నిర్ణయాైకెనా వెనుకాడరు. తనకు అధికారం ఇస్తే స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని 100 రోజుల్లో తెస్తానని ఎన్నికల ప్రచారసందర్భంగా 2014 ఏప్రిల్ ఒకటిన నరేంద్ర మోదీ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత 2014 నవంబర్ 14న వందరోజుల్లో స్విస్‌బ్యాంకు నల్లధనం తేకపోతే ఉరితీయమన్నారు. అదేనెల మూడోతేదీన 100 రోజు ల్లో స్విస్‌బ్యాంకులో నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు వేస్తానని ప్రకటించారు.

అధికారంలోకి వచ్చి ఆరునెలల్లోనే స్విస్ బ్యాంకు నల్లధనం తెచ్చేందుకు కమిటి వేసినా అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చం దంగా ఉండగా, కనీసం నల్లకుబేరులను ప్రకటించేం దుకు కూడా వారి ప్రైవసీ (వ్యక్తిగత స్వేచ్ఛ) దెబ్బతింటుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటించడమంటే కేంద్రప్రభుత్వానికి నల్లకుబేరుల ప ట్ల ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతుంది. 2006లో స్వి స్‌బ్యాంకులో భారత్ కుబేరుల సొమ్ము 23 వేల కోట్ల డాలర్లుకాగా, నేడు అది యాబైవేల కోట్ల డాలర్లకు చే రుకుంది. ఇది భారత్ కరెన్సీలో 35 లక్షల కోట్లకు స మానం. అంతా ఈ నల్ల కుబేరులు సంపాదంచిందే. వారి పేర్లు ప్రకటిస్తే వారికి ఇబ్బంది అవుతుందనే నె పంతో వారి కొమ్ముకాస్తున్న మోదీ ప్రభుత్వం, మనబ్యాంకులను, ఆర్థిక సంస్థలను మోసంచేసిన ఆర్థిక నేరగాళ్లయిన లలిత్ మోదీ (6,000 కోట్లు), విజయ్‌ుమాల్యా (9,000 కోట్లు), నీరవ్ మోదీ (11,000 కో ట్లు)లకు ఊడిగం చేస్తూ వారికి ఈ చట్టాలు వర్తించవన్నట్లుగా ఇతర దేశాలకు సాగనంపింది.

అధికారంలోకి వచ్చిందే తడవుగా భారత దేశ ఖనిజ చట్టం 1957ను సవరించి అపారైమెన ఖనిజసంపదను భారత్ బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టేం దుకు, బహుళ జాతి సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు చేసిన ఈ అన్యాయైమెన పనితో దేశంలోని ఖనిజ సం పద కలిగిన ప్రాంతాైలెన ఆదివాసీ ప్రాంతాలు నేడు దేశ పారామిలిటరీ బలగాల ఇనుపబూట్ల కింద నలుగుతున్నాయి. విలుైవెన దేశ ఖనిజ సంపదను దోచిపెట్టేందుకు చేసిన ఈ పనివల్ల ఈ దేశ ప్రజలు లక్షల కోట్ల సంపద నల్లకుబేరులకు చేరుతున్నది. అదాని, అంబానీలకు లబ్ధి చేకూర్చేందుకు వారి మిత్రుైలెన పి డికెడు బడా పెట్టుబడీదారులకు దేశంలోని అన్ని రకా ల సంపదను దోచిపెట్టేందుకు బహుళ జాతి సంస్థలకు దోచిపెట్టేందుకు ఇప్పటికే రిటైల్ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించగా ఇన్స్యూరెన్స్, రక్షణ, విద్యా రంగాల్లో 70శాతం పెట్టుబడులను ఆహ్వానిస్తూ చట్టాలు చేసింది. ఫలితంగా దేశంలోని సకల రంగాల్లో పేద, మధ్య తరగతి వ్యాపారుల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. గ్రామీణ భారతం నుం చి కాస్మోపాలిటన్ సిటీల వరకు ఉన్న దేశీయ బడా పెట్టుబడిదారుల, బహుళ జాతి సంస్థల షాపింగ్ మా ల్స్ కళకళ లాడుతుండగా, శతాబ్దాల తరబడి ఆధారపడి బతుకుతున్న చిన్న మధ్య తరగతి, పెద్ద వ్యాపారసంస్థలు దివాలా తీశాయి. జీఎస్‌టీని పెట్రోలు, డీజి ల్, క్రూడాయిల్ ఉత్పత్తులకు వర్తింప చేయకపోవడం వల్ల, ఈ ఉత్పత్తులపై 50 నుంచి వందశాతం పన్ను విధిచండంతో స్వతంత్ర భారతదేశంలో మున్నెన్నడూ లేనివిధంగా ధరలు పెరిగాయి. వీటి ప్రధానం అన్ని నిత్యావసర వస్తువులపై పడి సామాన్య ప్రజల జీవి తం పెనుభారంగా మారింది.

డీ మానిైటెజేషన్ పేరుమీద మోదీ రద్దుచేసిన 1000, 500 నోట్లరద్దు వల్ల ధనవంతులకు నష్టం లేకపోగా లాభం చేకూరి నల్లధనం మొత్తం తెల్లధనంగా మారింది. సామాన్య, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము తమ అవసరాలకు అందకపోవడం వల్ల నిరంతరం ఇబ్బంది పడుతున్నారు. క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ ఈ దేశ బడా పారిశ్రామికవేత్తలకు, బహుళ జాతిసంస్థలకు ఉపయోగపడుతుంది తప్ప ఈ దేశ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు. ఇక దేశంలో హిందూమతోన్మాదం పెరిగిపోయి సెక్యులర్ భావాలు కలిగిన రచయితలు, బుద్ధిజీవులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మధ్య తరగతి ప్రజలు బతకలేని పరిస్థితు ఏర్పడింది. ఆదివాసులు, దళితులు, మహిళలపై నిరంతరం జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, అవమానాలకు అంతే లేకుండా పోయింది. 

అధునాతన సాంకేతిక నైపుణ్యంతో అంతరిక్షంలో జీవించడానికి అనువుగా శాస్త్రవిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న నేటి తరుణంలో హిందూమత విశ్వాసా ల పేరుమీద ఆర్‌ఎస్‌ఎస్, బజరంగదళ్, విశ్వహిందూపరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యం త్రాంగం దళితులు, మహిళలు, ఆదివాసులు, నిమ్నవర్గాల మీద జరుగుతున్న దాడులు భారత సమాజాన్ని మళ్లీ మధ్య యుగాలకు తీసుకెళ్తోంది. హంతకులకు, ఆర్థిక నేరగాళ్లకు, అత్యాచార నేరగాళ్లకు కొమ్ముకాస్తు న్న దేశ మంత్రివర్గం, రాజ్య యంత్రాంగం భారత ప్రజాస్వామిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. సన్యాసులు, పూజారులు, మాంత్రికులు, తాంత్రికులు, మతం మత్తులో తూగుతున్నవారందరినీ ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయడం ద్వారా ఈ దేశ సమాజాన్ని హిందూ, హిందు వ్యతిరేక సమాజంగా చీల్చి అధికారాన్ని సుదీర్ఘకాలం నిలబెట్టుకునేందుకు బీజేపీ చేస్తున్న ఈ అప్రజాస్వామిక విధానాన్ని ప్రజలంతా ఒక్కటై ఎదుర్కోకపోతే రాబోయే రోజులు గడ్డు రోజులుగా మారడమే కాకుండా ఆదివాసి, దళిత, పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు మనుగడ కొనసాగించ లేవు. 

- చిక్కుడు ప్రభాకర్
8500810630  

English Title
కార్పొరేట్ల కాపరి!
Related News