జనభారం భూమి తరమా..!?

Updated By ManamWed, 07/11/2018 - 00:44
EARTH

imageప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవ త్సరం జులై 11న నిర్వహించుకుంటున్నాం. 1989లో జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జనాభా సమస్యపై ప్రపంచ దేశాలన్ని దృష్టి కేంద్రీకరించి చిత్తశుద్ధితో జనాభా నియంత్రించాలని, ఈ ఏడాదిని ‘కుటుంబ సంక్షేమం మానవహక్కు’గా విస్తృత ప్రచారం కల్పించి, అవగాహన చైతన్య సమితి ఆదేశాలను సభ్యదేశాలు పాటిస్తున్నాయి. ప్రపంచం నేటి ఆధునిక కాలంలో కుగ్రామ మైనది. ఇంటి నుంచి ప్రపంచాన్ని దర్శించ గలుగుచున్నాము.

ప్రపంచాన్ని ప్రస్తుతం పట్టి పీడిస్తున్న సమస్య అధిక జనాభా. నానాటికీ పెరుగుతున్న జనాభా కారణంగా ఆహార పదా ర్థాల కొరత, స్థలాభావం, పేదరికం, ఉపాధి, ఉద్యోగ సమస్యలను ఎదుర్కోవడంలో ప్రపం చం సతమతమవుతోంది. వనరులను పొదుపు గా వాడాల్సింది పోయి ఈ సమస్యలతో పాటు మానవజాతిని పర్యావరణం సమస్య కలవరపెడుతోంది. విపరీతంగా పెరుగుతున్న జనాన్ని జనస్థిరీకరణ, నియంత్రణ చేయడం ప్రస్తుతం అందరి బాధ్యతని మరువరాదు. చదువుకున్న వారు, మేధావులు, విజ్ఞానవంతులైన వారిలో కూడా ఈ రోజుల్లో ప్రపంచమంతటా స్వార్థం వేర్వేరు రూపాల్లో ప్రపంచాన్ని ఏలుతోంది. మూఢనమ్మకాలు (విశ్వాసం), ఆచారాల పేరుతో దేశం, ప్రాంతాలేైవెునా, కులాలు, మతాలు, జా తులు, వర్గాలు, ప్రాంతాలుగా విడిపోయి వారి వారి ఆధిపత్య భావాజాలంతో పెరుగుతున్న జనాభాను, విపత్కర పరిణామాలను మరిచి నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. 

ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశా లు నియంత్రణ చర్యలు చేపట్టాలనే లక్ష్యం సిద్ధించలేకపోతున్నాయి. ప్రపంచ దేశాలు భిన్న పరిపాలన విధానాల వల్ల కొన్ని దేశాలు, ఆయా దేశ జనాభాను పెంచాలని భావిస్త్తున్నాయి. ‘ఒక్కరే ముద్దు ఆపై వద్దు’ అని హద్దులు పెట్టుకుని కుటుంబ నియంత్రణ పాటిస్త్తున్న దేశా లున్నాయి. జనాభా విపత్తును నియంత్రించ డానికి ప్రపంచ దేశాలు సామాజిక బాధ్యతగా ఉమ్మడి ఎజెండాతో జనాభా నియంత్రణనే ప్రధా న అంశంగా తీసుకున్నాయి. ప్రపంచలోని అన్ని దేశాలు ఆమలు జరిగేలా వ్యక్తుల నుంచి ప్రపంచం యావత్తు స్వీయ బాధ్యతతోపాటు, సామాజిక బాధ్యతగా తీర్మానించుకొని అమలు కు పూనుకోవాలి. లింగ వివక్షను వీడి సమాన భావంతో స్త్రీ, పురుషులు ఇద్దరూ కుటుంబ నియంత్రణ పాటించి జనాభాను తగ్గించడానికి తోడ్పడాలి. స్త్రీ విద్యను ప్రోత్సహించి యువతీ యువత జనస్థిరీకరణ, నియంత్రణ ప్రస్తుత పరిస్థితుల్లో పాటిస్తేనే ఆర్థికంగా ఎంతో తోడ్పడు తుంది. 2050 నాటికి భారత్, చైనా, అమెరికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ తదితర 9 దేశాల జనాభా ప్రపంచ జనాభాలో సగం శాతాన్ని ఆక్రమిస్తోంద ని తెలుస్తోంది. ప్రపంచ జనాభాలో సుమారు 40% ఇండియా, చైనాలోనే ఉన్నారు. అలాగే ఐక్యరాజ్యసమితి ఈ మధ్య చేసిన అధ్యయనం ప్రకారం వచ్చే 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళా సంతానోత్పత్తి శాతం సరాసరిగా 2.5 నుంచి 2.1కి పడిపోతుందని తెలిపింది. దీనికి మనిషి జీవన విధాన, ఆహారపు అలవాట్లు పర్యావరణంలోని స్థితిగతులు కారణం కావచ్చు ననిపిస్తుంది.

మనదేశంలో జనాభా నియంత్రణ కు వ్యక్తిగతంగా, సామాజికంగా బాధ్యతగా కుల, మత, వర్గ లింగ వివక్షలు చేపట్టాలి. మనో భావాల పేరుతో అభిప్రాయ వ్యక్తీకరణ, నిలవ రించ రాదు. భావ ప్రకటన ఏ ఒక్కరి సొత్తు కాదు, ఒక వర్గానిది అంతకన్నా కానేకాదు. భావ సంఘర్షణ జరగాలి, మంచీచెడును జనం గ్రహిం చుకొని, నిర్ధారణకు రావాలి. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో సగం జనాభా పెరుగు దలే కారణంగా నిలుస్తోంది. మూఢ నమ్మకా లను వీడి కులాలకు మతాలకు అతీతంగా కుటుంబ నియంత్రణ పాటించాలి. 

- మేకిరి దామోదర్
(నేడు ప్రపంచ జనాభా దినోత్సవం)

English Title
జనభారం భూమి తరమా..!?
Related News