ఐపీఎల్‌లో మెరవనున్న రెండు మహిళా జట్లు

Updated By ManamThu, 05/17/2018 - 16:19
Women’s T20 challenge, Harmanpreet Kaur, Smriti Mandhana, named captains, BCCI
  • వాంఖడే స్టేడియం వేదికగా మహిళల టీ20 చాలెంజ్ మ్యాచ్..

Women’s T20 challenge, Harmanpreet Kaur, Smriti Mandhana, named captains, BCCI వాంఖడే: ఐపీఎల్‌-11 సీజన్‌లో రెండు మహిళా జట్లు మెరవనున్నాయి. ఐపీఎల్ ‘మహిళా టీ20 చాలెంజ్’ మ్యాచ్‌లో తలపడే రెండు జట్ల పేర్లు, సభ్యుల జాబితాను గురువారం భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటల నుంచి వాంఖడే స్టేడియం వేదికగా రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ సూపర్ నోవాస్, ఐపీఎల్ ట్రయల్ బ్లేజర్స్ అనే రెండు మహిళా జట్లు బరిలోకి దిగనున్నాయి. సూపర్ నోవాస్ జట్టుకు భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌‌గా వ్యవహరించనుండగా, ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు స్మృతి మంధాన సారథి బాధ్యతలు చేపట్టనుంది.

ఈ ఐపీఎల్ చాలెంజ్ మ్యాచ్‌లో ఒక్కో జట్టులో 26 మంది ఆటగాళ్లు ఉండగా, వారిలో 10 మంది అంతర్జాతీయ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు ఉన్నట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. గాయం నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లాన్నింగ్ ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ సూపర్ నోవాస్ జట్టు తరపున ఆడనుంది. కాగా, ఐపీఎల్-11 షెడ్యూల్ ప్రకారం వాంఖడే స్టేడియం వేదికగా అదే రోజున క్వాలిఫయర్-1 మ్యాచ్ రాత్రి 7 గంటలకు జరుగనుంది.

జట్లు వివరాలు..
ఐపీఎల్ ట్రయల్ బ్లేజర్స్: అలిస్సా హీలే (వికెట్ కీపర్), స్మృతి మంధాన (కెప్టెన్), సుజీ బేట్స్, దీప్తి శర్మ, బెత్ మూనీ, జెమిమా రోడ్రిగ్స్, డానియల్ హజెల్, శిక్కా పాండే, లీయా తాహూ, ఝులన్ గోస్వామి, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్, డేయలన్ హేమలత.

ఐపీఎల్ సూపర్ నోవాస్: డానియెల్ వ్యాట్, మిథాలీ రాజ్, మెగ్ లాన్నింగ్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్సీ పెర్రీ, వేద కృష్ణమూర్తి, మోనా మెశ్రాం, పూజా వస్త్రాకర్, మేగన్ షట్, రాజేశ్వరి గైక్వాడ్‌, అనుజ పాటిల్, తానియా భాటియా (వికెట్ కీపర్).

English Title
IPL 2018: BCCI announces squads for Women’s T20 challenge; Harmanpreet Kaur, Smriti Mandhana named captains
Related News