బాలయ్య మూవీకి ఆసక్తికర టైటిల్..?

Updated By ManamThu, 06/14/2018 - 10:55
balayya

balayya క్రిష్ దర్శకత్వంలో‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నటించనున్న నందమూరి బాలకృష్ణ, ఆ తరువాత వినాయక్ డైరక్షన్‌లో ఓ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పాడు. సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ కోసం ఓ ఆసక్తికర టైటిల్‌ను అనుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ‘ఏకే 47’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియ, సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్‌ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

English Title
Interesting title for Balakrishna's movie..?
Related News