ఇండియా శుభారంభం

Updated By ManamSat, 07/21/2018 - 23:13
hocky
  • ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్ డ్రా

  • టాప్ టీమ్‌ను నిలువరించిన రాణి సేన 

  • మహిళల హాకీ వరల్డ్ కప్

లండన్: మహిళల వరల్డ్ కప్ హాకీ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత జట్టు సత్తా చాటింది. శనివారమిక్కడ ప్రపంచ 2వ ర్యాంక్ జట్టు ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. రెండో క్వార్టర్‌లో తొలి గోల్ చేసిన రాణి రాంపాల్ సేన ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను దాదాపు చివరి వరకు నిలువరించింది. తొలి అర్ధ భాగంలో ఇంగ్లాండ్‌కు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించాయి. మొత్తంగా తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లను రాబట్టిన ఇంగ్లాండ్ చివరికి తొమ్మిదో పెనాల్టీ కార్నర్‌లో గోల్ చేయగలిగింది. భారత జట్టు ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించింది. మిడ్‌ఫీల్డర్ నమిత టొప్పొకు ఇది 150వ మ్యాచ్. 

image


ఇరు జట్లకు గోల్స్ నిల్
ఆరంభంలోనే ఇంగ్లాండ్ జట్టు ఆటాకింగ్‌కు దిగింది. దీంతో పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే దాన్ని భారత గోల్ కీపర్ సవిత డైవ్ కొట్టి సేవ్ చేసింది. తర్వాత భారత జట్టు ఎదురుదాడికి దిగింది. అంతేకాకుండా ఇంగ్లాండ్ ప్లేయర్స్ దాడిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత ఫార్వర్డ్ ప్లేయర్స్ ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచుతూ ముందుకు దూసుకెళ్లారు. దీంతో ఇంగ్లాండ్ డిఫెండర్స్ భారత ప్లేయర్స్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఐదు నిమిషాలు ముగిసినా తొలి గోల్ నమోదు కాలేదు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ బంతిపై పట్టు సాధించి భారత జట్టు అర్ధ భాగంలోనే ఎక్కువ సేపు ఉన్నారు. ఈ క్రమంలో 8వ నిమిషంలో ఇంగ్లాండ్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. కానీ దాన్ని కూడా భారత ప్లేయర్ తిప్పికొట్టారు. తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్స్ పేలవమైన పాస్‌తో బంతి భారత్ ప్లేయర్స్‌కు లభించింది. తొలిసారి భారత ప్లేయర్స్ గోల్ షాట్ కొట్టారు. కానీ గురితప్పింది. ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య తీవ్ర ఒత్తిడి నెలకొంది. కొన్ని లూజ్ బంతులు లభించినప్పటికీ ఇరు జట్ల ఫార్వర్డ్ ప్లేయర్స్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలి క్వార్టర్ ముగిసే చివరి నిమిషాల్లో కోచ్ ఎస్‌జోర్డ్ మారిజ్నే గట్టిగా ఆరుస్తూ జట్టు సభ్యులకు సూచనలిచ్చారు. తొలి క్వార్టర్‌లో ఇండియా కంటే ఇంగ్లాండ్ జట్టుకు గోల్ చేసే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. రెండు పెనాల్టీ కార్నర్‌లు కూడా లభించాయి. అయినప్పటికీ తొలి క్వార్టర్ ముగిసే సమయానికి రెండు జట్లూ 0-0తో నిలిచాయి. 

1-1తో స్కోరు సమం
ఇక మూడో క్వార్టర్ ఆరంభంలో అభిమానులు ‘లెట్స్ గో ఇంగ్లాండ్.. లెట్స్ గో’ అంటూ ఇంగ్లాండ్ జట్టుకు మద్దతుగా imageనినాదాలు చేశారు. తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్స్ లెఫ్ట్, రైట్ ఫ్లాంక్స్ నుంచి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. భారత గోల్ కీపర్ సవిత ద్విపాత్రాభినయం చేసింది. ఒకవైపు గోల్ కాకుండా జట్టును కాపాడుతూనే మరోవైపు ఇంగ్లాండ్ ప్లేయర్స్ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. తర్వాత మూడో క్వార్టర్ ముగిసేందుకు మరో 2 నిమిషాలుందనగా బంతితో భారత్ గోల్ బాక్స్‌పై దాడి చేసేందుకు ఇంగ్లాండ్ ప్లేయర్స్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ భారత డిఫెండర్లు వాళ్లని దరిదాపులకు కూడా రాకుండా అడ్డుకున్నారు. దీంతో మూడో క్వార్టర్ ముగిసే సమయానికీ ఇండియా 1-0 ఆధిక్యంతో నిలిచింది. భారత జట్టు మిడ్‌ఫీల్డర్ నమిత టొప్పోకు ఇది 150వ మ్యాచ్ కావడం విశేషం. 

ఎట్టకేలకు ఇంగ్లాండ్‌కు తొలి గోల్
ఇక చివరి, నాల్గో క్వార్టర్ 48వ నిమిషంలో ఇంగ్లాండ్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. కానీ ఇంగ్లాండ్ గోల్ ప్రయత్నాన్ని భారత్ ప్లేయర్స్ అద్భుతంగా అడ్డుకున్నారు. డ్రాగ్ ఫ్లిక్‌ను భారత డిఫెండర్స్ అడ్డుకునే ప్రయత్నంలో బంతి ప్రమాదకరంగా పైకి లేవడంతో అంపైర్ ఇంగ్లాండ్‌కు మరో పెనాల్టీ కార్నర్ ఇచ్చారు. అయితే దాన్ని భారత్ సునాయాసంగా అడ్డుకుంది. 52వ నిమిషంలో భారత్ ప్లే యర్స్ అద్భుతంగా ఇంగ్లాండ్ గోల్ బాక్స్ వైపు దూసుకెళ్లారు. కానీ డిఫ్లెక్షన్ దూరంగా వెళ్లడంతో ఇంగ్లాండ్ మరో గోల్ నుంచి తప్పిం చుకుంది. అదే నిమిషంలో ఇంగ్లాండ్‌కు 8వ పెనాల్టీ కార్నర్ లభిం చింది. సవిత దాన్ని కూడా సేవ్ చేసింది కానీ అంపైర్ 9వ పెనాల్టీ కార్నర్ ఇచ్చారు. ఎట్టకేలకు దీన్ని ఇంగ్లాండ్ గోల్‌గా మలిచింది. లిల్లీ ఓస్లే గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. చివరి నిమిషంలో మరో గోల్ కోసం ఇరు జట్ల ప్లేయర్స్ తీవ్రంగా ప్రయత్నించారు.

ఇండియాకు తొలి ఆధిక్యం
imageరెండో క్వార్టర్ ప్రారంభంలో ఇండియా ప్లేయర్ దీపికా బంతితో ఇంగ్లాండ్ డి లోకి ప్రవేశించింది. కానీ ఇంగ్లాండ్ డిఫెండర్స్ అడ్డుకున్నాడు. ఇండియా డి సర్కిల్‌లో ఇరు జట్ల ప్లేయర్స్ ఢీ కొనడంతో అంపైర్ ఇంగ్లాండ్‌కు పెనాల్టీ కార్నర్ ఇచ్చారు. ఈ కార్నర్‌ను అడ్డుకునే ప్రయత్నంలో బంతి ఇండి యా ప్లేయర్ శరీరానికి తగలడంతో అంపైర్ పెనాల్టీ స్ట్రోక్ ఇచ్చారు. దీంతో ఇండియా ప్లేయర్స్ రెఫరల్ సహాయాన్ని కోరారు. టీవీ రీప్లేలో బంతి ప్లేయర్ స్టిక్‌కు తగిలినట్టు తేలడంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని పెనాల్టీ కార్నర్ ఇచ్చారు. అయితే దాన్ని భారత గోల్ కీపర్ సవిత సమర్థవంతంగా తిప్పికొట్టింది. దాదాపుగా స్కోరు చేస్తార నుకుంటున్న సమయంలో ఇండియా ప్లేయర్స్ అడ్డుకున్నారు. అయితే అంపైర్ పెనాల్టీ కార్నర్ ఇవ్వడంతో ఇండియా ప్లేయర్స్ మళ్లీ రెఫరల్ కోరారు. వీడియో అంపైర్ కూడా సరి గా నిర్ధారించలేకపోవడంతో నిర్ణయాన్ని తిరిగి ఫీల్డ్ అంపైర్‌కు వదిలేశారు. దీంతో ఇంగ్లాండ్ పెనాల్టీ కార్నర్‌కు వెళ్లింది. కానీ మరోసారి సవిత అద్భుతంగా డైవ్ చేసి గోల్‌ను అడ్డుకుంది. అయితే తర్వాతి నిమిషంలో ఇండియా తొలి గోల్ చేసింది.  రెండో క్వార్టర్, తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి టీమిండియా 1-0 ఆధిక్యంతో నిలిచింది.

సౌతాఫ్రికాపై జర్మనీ గెలుపు
మరో మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై జర్మనీ జట్టు 3-1తో గెలిచింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ ఏక పక్షంగా కొనసాగింది. మ్యాచ్ ప్రారంభమైన 14వ నిమిషంలో జర్మనీ జట్టు గోల్ చేసి 1-0 ఆధిక్యంతో నిలిచింది. అయితే 27వ నిమిషంలో జర్మనీ ప్లేయర్ లిసా అల్టెన్‌బర్గ్ గ్రీన్ కార్డ్‌కు గురైంది. తొలి అర్ధ భాగంలో మరో గోల్ నమోదు కాకపోవడంతో జర్మనీ 1-0తో నిలిచింది. కానీ రెండో అర్ధ భా గం ఆరంభంలోనే 32వ నిమిషంలో జర్మనీ గోల్ చేసి తన ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది. కానీ మరో నిమిషాల తర్వాత 40వ నిమిషంలో సౌతాఫ్రికా గోల్ చేయడంతో జర్మనీ ఆధిక్యం 2-1కి తగ్గింది. 54వ నిమిషంలో జర్మనీ జట్టు మరో గోల్ చేసి ఆధిక్యాన్ని 3-1కి పెంచుకుంది. అయితే తాము కూడా మరో గోల్ చేయా లన్న దూకుడులో సౌతాఫ్రికా ప్లేయర్ ఎరిన్ హంటర్ గ్రీన్ కార్డ్‌కు గురైంది. చివరికి జర్మనీ జట్టు తొలి విజయం నమోదు చేసింది.

English Title
India play out a 1-1 draw against England in their Pool B opening match
Related News