బ్రిటన్ ఎంపీని వెనక్కి పంపిన భారత్‌

Updated By ManamThu, 07/12/2018 - 13:11
british mp lord alexander carlile
british mp lord alexander carlile

న్యూఢిల్లీ: భారత్‌లో బ్రిటన్ ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది. సరైన వీసా పత్రాలు లేనందున  బ్రిటీష్‌ పార్లమెంటేరియన్‌ లార్డ్‌ అలెగ్జాండర్‌ కార్లిలేను ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఆయనను వెనక్కి పంపించివేశారు. కాగా కార్లిలే...బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాకు న్యాయ సలహాదారుగా కూడా ఉన్నారు.

అయితే కార్లిలే ప్రస్తుత పర్యటన... ఆయన వీసాలో పొందుపరిచిన వివరాలు సరిపోలనందున భారత్‌లోకి అనుమతించలేదని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌  వెల్లడించారు. కానీ వీసాలో పర్యటన ఉద్దేశాన్ని​ కార్లిలే వేరేగా పేర్కొనడంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

English Title
Inappropriate Visa:India Sends Back British MP From Airport
Related News