హక్కులు అడిగితే శిక్షలు తప్పవా?

Updated By ManamTue, 10/23/2018 - 03:37
editorial colomn

భారతదేశం ప్రపం చంలోనే అతిపెద్ద ప్ర జాస్వామ్య వ్యవస్థ. మన రాజ్యాంగం ప్ర పంచానికే తలమాని కం. 71 ఏళ్ల భారత ప్రజాస్వామ్య వ్యవ స్థలో ఇక్కడి రాజకీ య పార్టీల విధానా లు, 125 కోట్ల ప్రజ ల మనోభావాలు కీలకం. అందుకే మన వ్యవస్థ ఏడు దశాబ్దాలుగా నిత్యనూతనంగా ఉంది. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రజాస్వామ్య గొప్పదనం. మన దేశంలో అనేక జాతీ య పార్టీలు, 50కి పైగా ప్రాంతీయ పార్టీలు ఉన్నా జాతి సమగ్రతలో అన్నింటిదీ కీలక భూమిక. అయితే జాతీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం జాతీయ దృక్పథాలను కోల్పోయి సంకుచిత ధోరణితో వ్యవహరిస్తూ తాత్కాలిక ప్రయోజనాల కోసం పాకు లాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ జాతి విశాల ప్రయోజ నాల కోసం ఆలోచన చేస్తుంది. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి జాతీయ భావాలున్న పార్టీ. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ప్రతి ప్రసంగంలో ‘తొలుత భారతీయు లం, ఆ తరువాతే తెలుగువారం’ అని చెప్పేవారు. ఎన్టీఆర్‌లో అణువణువునా దేశభక్తి తొణికిసలాడేది. ఒక సిద్ధాంత ప్రాతిపదికన, జాతీయ రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఒక ప్రాంతీయ పార్టీ కీలక భూమిక పోషించడం తెలుగుదేశంతోనే ప్రారంభమైంది. ఒక జాతీయ పార్టీకి ఉండాల్సిన అన్ని రకాల సాధన సం పత్తి, బలం, బలగం తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. 

imageరాజ్యాంగంలోని 11వ భాగం 7వ షెడ్యూల్ కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంబంధాల గురించి తెలుపు తుంది. రాజ్యాంగంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సా హకాలు అందించి అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని రాజ్యాంగం సూచిస్తోంది. అన్ని రాష్ట్రాల పట్ల సమాన ఆదరణ చూపాలని చె ప్తుంది. హక్కులు అడిగితే శిక్షలు తప్పవు అన్నట్టుగా నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. 2014 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సహా విభ జన చట్టంలోని అంశాలను నెరవేర్చుతామని ఉన్నవి, లేనివి అన్ని చెప్పి బీజేపీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను స్వర్గలోకంలో  విహరింపజేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను బీజేపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది.

ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీ లను అమలు  చేయమని అడగ్గా ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని, ఇకముందు ప్రత్యేక హోదా ఇస్తున్న రాష్ట్రాలకు కూడా హోదా తీసివేస్తున్నామని చెప్పి మిగిలిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పొడిగిస్తు మన రాష్ట్రానికి మాత్రం హోదా ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించి ప్రత్యేక హోదా ఇవ్వబోయేది లేదు అన్నారు. దానికి నిరసనగా బీజేపీ నియంతృత్వాన్ని ధిక్కరిస్తు ఆంధ్రుల హక్కుల సాధనకు తెలుగుదేశం ప్రభుత్వం పోరాటానికి సిద్ధమైంది. ఆంధ్రులకు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసనగా పార్లమెంట్‌లో ఎంపీ లు ఆంధ్రకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని నిల దీస్తూ మోదీ ప్రభుత్వం ఆంధ్రకు చేస్తున్న అన్యాయా న్ని దేశ ప్రజలందరూ చూస్తుండగా ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న పక్షపాత ధోరణిని పార్లమెంట్ సాక్షిగా నిలదీశారు. ఆ రోజు ఆవేశంతో రగిలిపోయిన నరేంద్ర మోదీ ఎంపీలను ఉద్దేశించి త్వరలో మీకు సన్మానం చేస్తామంటూ మాట్లాడడం హక్కులు అడిగినందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడతామన్న విధంగా బెదిరింపులకు పాల్పడ్డారు.

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పార్లమెంట్ సాక్షిగా హక్కులు అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా కేంద్ర సంస్థ చేసిన ఒక సర్వేలో ఆంధ్రప్రదేశ్ అవీనీతిలో చివరి మూడోస్థానంలో ఉందని వెల్లడైంది. మిగతా బీజేపీ పాలిత ప్రాంతాలు అవీనితిలో మొదటి స్థానం లో నిలిచాయి.  కాగా అవిశ్వాస తీర్మానంలో కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించి హక్కుల సాధనకు పోరాడిన టీడీపీ నాయకుల ఇళ్ళపై నేడు ఐటీ, ఈడీ దాడులు నిర్వహిస్తూ తమను వ్యతిరేకించి హక్కుల కోసం పోరాడిన వారిపై దాడులు తప్పవు అంటు హెచ్చరింపుల్లో భాగంగానే ఇప్పుడు టీడీపీ నాయకు లపై  ఐటి దాడులు జరుగుతున్నాయి. ముందుగానే తెలుగుదేశంపై జరగబోయే దాడుల గురించి ఒక సినీ నటుడు చెప్పటం జరిగింది. ఆయన చెప్పిన విధం గానే సీఎం చంద్రబాబునాయుడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కేసులు పెట్టడం, టీడీపీ నాయకుల ఇళ్ళపై ఏకపక్షంగా దాడులకు పాల్పడడం ఇవన్నీ కక్షసాధింపు చర్యలలో భాగాలేనని ప్రజలకు స్పష్టంగా అర్ధమవు తోంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. అవినీతి జరిగి ఉంటే ఈజ్ డూ యింగ్‌లో రాష్ట్రానికి మొదటి స్ధానం ఎలా వస్తుంది? ఆంధ్రలో అవీనీతి అంటూ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు.

రౌడీ షీటు ఉన్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమం త్రిగా నియమిస్తారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంస్థలను గౌరవప్రదంగా భావి స్తారు. హక్కులు అడిగిన వారిపై ఇలానే కుట్రపూరి తంగా ఈడీ, ఐటీ దాడులు చేయిస్తారు. గతంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌సింగ్ హు డా ఇంట్లో సీబీఐ సోదాలు జరిగాయి. ఆగస్టు 2, 2017 కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేస్తున్న  శివకుమార్, ఆయన సోదరుడితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బసచేస్తున్న ఓ రెస్టారెంటుపై కూడా దాడు లు నిర్వహించారు. 2017 మార్చిలో హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఆదాయానికి మిం చి ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఐటి దాడులు చేయిం చారు. 17-4-2017న లంచాలు తీసుకుంటున్నా రం టూ తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు మం త్రులు, ఐదుగురు ఎంపీలపై సీబీఐ కేసులు పెట్టిం చారు. 2017 మే నెల పదో తేదీన ఢిల్లీ సీఎంకేజ్రీవాల్ రెండు కోట్ల రూపాయులు లంచం తీసుకున్నారంటూ కక్షపూరితంగా ఏసీబీ దర్యాప్తు చేసింది. 2017 ఏప్రిల్ 17న వాటాల విక్రయంలో రూ.45 కోట్ల మేర విదేశీ మాదకద్రవ్య నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారంటూ చిదంబరం కుమారుడు ఈడీ నోటీసులు పంపి కార్తి, అతని స్నేహితుల ఇళ్లపై సోదాలు నిర్వహించారు. 

కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థి భీమన్న నాయక్ ఇం ట్లో రెండురోజులు ఐటి అధికారులు సోదాలు నిర్వ హించారు. కానీ ఆయన ఇంట్లో ఒక్క అక్రమ సంపా దన పత్రాన్ని కూడా కనుగొనలేకపోయారు. గుజరాత్ ఎన్నికల్లో హరిజన నాయకున్ని, పటేల్ వర్గానికి చెం దిన మరొక నాయకుడినీ ఇలాగే చిత్రహింసలకు గురి చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఇదే రకైవెున ఐటి దా డులు చేస్తున్నారు. స్వతంత్ర సంస్థలను మోదీ తన స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటూ తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు, నాయకులపై అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈ చర్యలు  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నియంతృత్వానికి అడ్డు లేకుండా చేసుకుంటూ నేటి బీజేపీ పాలన నాటి బ్రి టిషు ప్రభుత్వ పాలనను తలపిస్తోంది. నాడు ఎలా గైతే బ్రిటిషు ప్రభుత్వం తమ నిరంకుశ పరిపాలనను వ్యతిరేకించిన వారిని చిత్రహింసల పాలు చేసిన విధంగానే నేడు బీజేపీ నిరంకుశత్వాన్ని వ్యతిరేకించిన వారిపై ఐటి దాడులతో చిత్రహింసల పాలు చేస్తున్నారు. 

దేశ సంపదను ఎలాగైతే బ్రిటిషర్లు బ్రిటన్‌కు కొ ల్లగొట్టుకుపోయారో అదేవిధంగా మోదీ కూడా బీజేపీ యేతర పాలిత ప్రాంతాల సంపదను, అవకాశాలను బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తూ బ్రిటిష్ ప్రభుత్వ పాలనను తలపింపజేస్తున్నారు. దళితుల ఆహారపు అలవాట్లను కూడా శాసిస్తూ వారి వ్యక్తిగత హక్కుల ను హరిస్తూ వారిపై భౌతికదాడులకు పాల్పడుతు న్నారు. ఆర్‌ఎస్‌ఎస్, భజరంగదళ్ వంటి మతతత్వ వాద సంస్థలను పెంచిపోషిస్తూ దేశంలో ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. వైునారిటీల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూస్తూ ముమ్మారు తలాక్ చట్టం విషయంలో జోక్యం చేసుకొని వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నా రు. బీజేపీ నియంతృత్వాన్ని వ్యతిరేకించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. హక్కులు అడిగిన వారి పై ఐటి, ఈడీ వంటి సంస్థలను వ్యక్తిగత కక్షలకు వాడుకోవటం ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసినట్లువు తుంది. నియంతృత్వ పోకడలను అనుసరించిన ఏ పార్టీ మనుగడ సాగించి నట్లు చరిత్రలో లేదు. బీజేపీ నియంతృత్వానికి ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించు కోక తప్పదు.

English Title
if asked for right?
Related News