వారి కోసం తల్లిగా కూడా వ్యవహరిస్తున్నా

Updated By ManamFri, 05/25/2018 - 11:59
boney

boney kapoor అతిలోక సుందరి శ్రీదేవి మరణం అందరి మనసును కలిచివేయగా.. బోని కపూర్‌పై మాత్రం బాధ్యతను మరింత పెంచింది. శ్రీదేవి ఉన్నన్ని రోజులు పిల్లల గురించి ఏ మాత్రం కలత చెందని బోని కపూర్, ఇప్పుడు వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన మొదటి భార్య పిల్లలైన అర్జున్, అన్షులాలను జాన్వీ, ఖుషీ(శ్రీదేవి, బోని కపూర్ పిల్లలు)లకు దగ్గర చేసిన బోని ఆ నలుగురికి ఇప్పుడు తల్లి, తండ్రి రెండూ తానే అయ్యాడు.

ఈ విషయంపై తాజాగా మాట్లాడిన బోని.. ‘‘ప్రతి క్షణం మేము శ్రీదేవిని మిస్ అవుతున్నాం. మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా తను నా పక్కన లేదనే బాధ చాలా ఉంది. నా పిల్లలకు ఇప్పుడు తండ్రిగానే కాకుండా తల్లిగా కూడా మారాను’’ అంటూ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోని దుబాయ్‌లోని ఓ హోటల్‌లో శ్రీదేవి మరణించిన విషయం తెలిసిందే.

English Title
I am trying to both mother and father to my childen: Boney Kapoor
Related News