స్వామి పరిపూర్ణానందకు నోటీసులు

Updated By ManamThu, 07/12/2018 - 20:43
 spiritual leader, Hyderabad, Cyberbad police, issues notices, Swami paripoornananda swamiji

 spiritual leader, Hyderabad, Cyberbad police, issues notices, Swami paripoornananda swamijiహైదరాబాద్‌: ఆరు నెలల పాటు నగర బహిష్కరణకు గురైన శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందకు సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు గురువారం వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఇటీవల ఆరు నెలల పాటు బహిష్కరిస్తున్నట్టు హైదరాబాద్ కమిషనరేట్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన స్వామి పరిపూర్ణానంద‌పై నగర బహిష్కరణ ఎందుకు విధించకూడదు? అని స్వామీజీని ఉద్దేశించి నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. బహిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు పేర్కొన్న అంశాలనే రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు తమ నోటీసుల్లో తెలిపారు. దీనికి సంబంధించి 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని స్వామిజీని పోలీసులు కోరారు.

ఇప్పటివరకూ హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలోనే స్వామి పరిపూర్ణానందపై బహిష్కరణ విధించిన నేపథ్యంలో ఆయన సైబరాబాద్‌లో బస చేసేందుకు వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్లు కూడా స్వామి పరిపూర్ణానంద‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను ప్రస్తుతం కాకినాడలో ఉన్న స్వామీజీకి గానీ, ఆయన ప్రతినిధులకు గానీ పోలీసులు అందజేసే అవకాశం ఉంది. 

English Title
Hyderabad, Cyberbad police issues notices to spiritual leader Swami paripoornananda swamiji
Related News