బళ్లకు సెలవులు

Holidays
  • 18న తిరిగి ప్రారంభం

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. జనవరి 18 వ తేదిన తిరిగి స్కూళ్లు, కాలేజిలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ డీఈవో, ఆర్జేడీలకు ఆదేశాలు జారీ చేసింది. క్రిస్మస్ సెలవులు ఇచ్చిన మిషనరీ స్కూళ్లకు, కాలేజీలకు సంక్రాంతి సెలవుల్లో మినహాయింపునిచ్చారు. వారు సంక్రాంతి రోజు సెలవు దినాన్ని పాటించాలని ఆదేశించారు. జూనియర్ కాలేజిలు జనవరి 16 వ తేదిన ప్రారంభం కానున్నాయి. జనవరి 11 నుంచి 17 వరకు మొత్తం ఏడు రోజులు తెలంగాణలో విద్యాశాఖ సెలవులను ప్రకటించింది. సెలవు దినాల్లో క్లాసులు నిర్వహించే ప్రైవేటు కాలేజిలు, స్కూళ్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎక్కడైన తరగతులు నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.
 

Tags

సంబంధిత వార్తలు