భాగ్యనగర వాసులకు హై అలర్ట్

Updated By ManamThu, 10/18/2018 - 09:56
Swine Flu

Swine Fluహైదరాబాద్: స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరిస్తున్నందు వల్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హై అలర్ట్ ప్రకటించింది. వృద్ధులు, గర్భిణులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించింది. మధుమేహంతో బాధపడుతున్న వారు, రక్తపోటు, అధిక బరువుతో బాధపడుతున్నవారు, గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులున్న వారికి స్వైన్‌ఫ్లూ త్వరగా సోకే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

కాగా స్వైన్‌ఫ్లూ కారణంగా ఆగష్టు నుంచి ఇప్పటివరకు 11మంది మరణించారు. దీంతో అప్రమత్తమైన వైద్యా ఆరోగ్య శాఖ ప్రముఖ ఆసుపత్రిలన్నింటిలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలుంటే దానిని స్వైన్‌ఫ్లూగా అనుమానించాలని వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు వెల్లడించారు.

English Title
High Alert to Hyderabad People
Related News