జులై 28న హ్యాపి వెడ్డింగ్

Updated By ManamThu, 07/12/2018 - 01:21
movie

imageసుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. యు.వి. క్రియేషన్స్, పాకెట్ సినిమా పతాకాలపై లక్ష్మణ్ కార్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే. అయితే పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జరిగేరోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా చూపించాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు తమని తాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాలవారు, అన్ని వయసులవారు ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారు’’ అన్నారు. 

English Title
Happy wedding on July 28
Related News