థ్రిల్ చేసేందుకు హన్సిక రెడీ

Updated By ManamThu, 07/12/2018 - 01:21
hansika

imageఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం ద్వారా హీరోయిన్లు చాలా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను కూడా ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు హన్సిక కూడా అలాంటి సినిమాలో నటించబోతోంది. సస్పెన్స్‌తోసాగే ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు హన్సిక రెడీ అవుతోంది.

జ్యోస్టర్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యు.ఆర్.జమీల్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ అందించే సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుందట. ఈ చిత్రం కోసం ఇండియాలోని టాప్ టెక్నీషియన్స్‌ని ఎంపిక చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అయినప్పటికీ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తమ సినిమాలో ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటిస్తుంది. 

English Title
Hansika ready to thrill
Related News