‘గుహ’కథ ఓ గుణపాఠం

Updated By ManamFri, 07/13/2018 - 01:18
image

imageమానవుని శక్తియుక్తులు పలు చారిత్రక సంద ర్భాల్లో ఆశ్చర్యంలో ముంచెత్తుతుండడం నిరంత రాయంగా కొనసాగుతూనే ఉంటుంది.  థాయ్ లాండ్‌లోని ప్రముఖ తామ్ లుయాంగ్ గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలురు, వారి ఫుట్ బాల్ కోచ్‌ను సురక్షితంగా బయటకు తీసు కురా వడం ఒక హాలీవుడ్ హారర్ చిత్రాన్ని తలపించే రీతిలో కొనసాగింది. అందుకు అంతర్జాతీయ స మాజమంతా చేసిన కృషి మానవీయత ఇప్పటి కీ బతికే వుందన్న సత్యాన్ని మరోసారి చాటి చెప్పిం ది. థాయ్‌లాండ్ కొండ గుహలతో విపత్కర పరి స్థితుల్లో చిక్కుకున్న వారిని వెలికి తీసేందు కు బ్రిటిష్, ఆస్ట్రేలియా, చైనా, థాయ్‌లాండ్, అమె రికా, డెన్మార్క్ దేశాలకు చెందిన 18 మంది నిపుణులైన డైవర్ల బృందం చిన్నారులను విడత వారీ గా రక్షించి బయటకు తీసుకురావడం ఒక చారి త్రక ఘట్టం. వీరితోపాటు మరో వందమంది సిబ్బంది, వెయ్యిమంది థాయ్ సైన్యం సహాయ క చర్యల్లో పాల్గొనడమే కాక, మరో పదివేల మం ది అన్ని రకాలుగా ఈ ఆపరేషన్‌కు సహాయ సహ కారాలు అందించడం ఆధునిక ప్రపంచంలో ఉన్న మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది. ప్రభుత్వా లే కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కూడా థాయ్ ఆపరేషన్‌కు సహకరించాయి. రాకెట్ విడి భాగాలతో గుహలో చిక్కుకున్న ఫుట్‌బాల్ జట్టు పేరిట ‘వైల్డ్ బోర్’ అనే పేరుతో ఒక మినీ జలాం తర్గామిని ఈ సహాయ కార్యక్రమాల్లో వినియో గించేందుకు అప్పటి కప్పుడు రూపొందించి సం ఘటనా స్థలానికి పంపండం విశేషం. అమెరికా కు చెందిన అంతరిక్ష వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ జూన్ 23న కొండగుహలో చిక్కుకుపోయిన బృం దాన్ని గుర్తించడానికి పడిన శ్రమ అసాధారణమై నది. వానలు కొంత తెరిపి ఇవ్వడం కొంత కలిసి వచ్చినా, డైవర్ల సాహసోపేతమైన ప్రయ త్నంతో 18 రోజుల కృషి ఫలితంగా గుహలోని పిల్లల్ని సురక్షితంగా రక్షించగలిగారు. ఈ సహాయక చర్య ల్లో ఒక డైవర్ ఆక్సిజన్ అందక వీరోచిత మర ణం చెందారు. మానవులు తమ విజ్ఞానాన్ని, ప్ర తిభా పాటవాలను యుద్ధాల కోసం కాకుండా మానవ సంక్షేమం కోసం కలసికట్టుగా వినియో గిస్తే ఎంతటి అద్భుతాలను సృష్టించ వచ్చో ఈ ఘటన తెలియజేస్తుంది. థాయ్ ఆపరేషన్ విజ యవంతంగా ముగియడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధాని థెరెసామే సహా పలువురు హర్షం వ్యక్తంచేశారు. థాయ్ జూనియ ర్ ఫుట్‌బాల్ టీంలో ఒకరి జన్మ దినోత్సవం జరు పుకునేందుకు వాకాలంలో వరద నీరు ప్రవహించే గుహలలోకి ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేని పిల్లలు వెళ్లడం పొరపాటు. అయితే గుహలోకి వెళ్ళిన తరువాత పెద్ద వర్షం కురవడంతో గుహ ముఖ ద్వారం నీటితో నిండి పోవడంతో వారంతా గుహ లోనే చిక్కుకున్నారు. 18 రోజుల పాటు గుహలో చిక్కుకున్న ఆ బృందం నరకయాతన అనుభవిం చింది. సహాయక బృందం ధైర్యసాహసాలు, ప్రతి భాపాటవాలను ప్రపంచమంతా ప్రశంసించింది. డైవర్లతో పాటు గుహలోకి వెళ్ళిన వైద్యుడి త్యాగ నిరతిని కూడా అంతర్జాతీయ సమాజం కొనియా డింది. అదే సమయంలో గుహ నుంచి బయట పడతారో లేదో కూడా తెలియని అనిశ్చితిలో మ నోధైర్యం కోల్పోకుండా ఇన్నాళ్లూ గుహలోనే కా లం గడిపిన బాలురు యోగాతో మనోస్థైర్యం పొందడం కూడా అసమాన్యమైనది. పిల్లల కోచ్ గతంలో కొంతకాలం బౌద్ధ సన్యాసిగా ఆరామాల్లో గడిపిన అనుభవం బాలల్లో మనోధైర్యా న్ని నింపింది. థాయ్‌లాండ్ భయానక ఉదంతం ఇతర దేశాలలోని పిల్లలకు కూడా ఒక హెచ్చరిక కావాలి. బడిపిల్లలు, కళాశాల విద్యార్థులు వినోద యాత్రకు వెళ్ళడం సర్వ సాధారణం. పిల్లలు కొత్త ప్రదేశాలకు వెళ్లిన సందర్భంలో ఏదో అన్వేషించా లని ఉబలాట పడుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా నీళ్ళలోకి దిగకూడదు. కొత్త ప్రదేశాలలోకి చొచ్చు కుపోవడం ప్రమాదం. కానీ వారి వెంట ఉన్న కోచ్‌కు లోపలకు వెళ్లే ముందు కొంచెం ఆలోచిస్తే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. మన తెలు గు రాష్ట్రాల్లోనూ సరదాగా విహారానికి వెళ్లిన వి ద్యార్థులు, యువకులు అనేక ప్రమాదాల్లో చిక్కు కున్న ఉదంతాలు మనసును కలచి వేస్తుంటాయి. దుందుడుకు తనంతో పిల్లలు వ్యవహరి స్తుండ డం సహజం, అయితే వారి సంరక్షణ బాధ్యత వహించే పెద్దలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుం టూ, అప్రమత్తంగా దూరదృష్టితో వ్యవహరిం చాలి. ప్రపంచీకరణ వల్ల వెనుకబడిన, వర్ధమాన దేశాలను అభివృద్ధి చెందిన దేశాలు దోచుకుంటు న్నాయనే అపసవ్య పార్శ్వం మనకు తరచూ అ నుభూతం కావడం విధితమే. అయితే థాయ్ గుహలో చిక్కుకున్న బాధితుల బృందాన్ని విడు దల చేసే ఆపరేషన్ కోసం అతి తక్కువ సమ యంలో అందిన అంతర్జాతీయ సహకారం, సమ న్వయం ప్రపంచీకరణ సవ్య పార్వ్శాన్ని ప్రపంచా నికి పరిచయం చేసిందన్న వ్యాఖ్యానాలు వెల్ల డైనాయి. థాయ్ భయానక గుహ నిర్బంధ పరి ణామం ప్రపంచ మానవాళికి ఒక గుణపాఠంగా నిలుస్తుంది. అసాధ్యమైనదిగా కనిపిస్తున్న విష యాన్ని అత్యంత ధైర్య సాహసాలతో, ప్రతిభా పాటవాలతో, సమిష్టి కృషి ద్వారా థాయ్ ఫుట్ బాల్ బృందాన్ని గుహ నుంచి విడుదలను సుసాధ్యం చేయడం మానవాళి శక్తి సామర్థ్యాలకు సజీ వ తార్కాణంగా నిలుస్తుంది.

Tags
English Title
'Guha' is a masterpiece
Related News