రూ.33,000 పైకి బంగారం

Gold
  • ఢిల్లీలో రూ.270 పెరిగిన 10 గ్రాముల పసిడి ధర

  • దీంతో రూ.33,070లకు చేరిక

  • రూ.410లతో పెరుగుదలతో రూ.40,510లకు కేజీ వెండి ధర

న్యూఢిల్లీ: రూపాయి 70 స్థాయికి పడిపోవడంతో సురక్షిత సాధనమైన బంగారానికి దేశీయంగా డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1,294.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.పసిడి దగదగమంటోంది. బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగాయి. రూ.33,000 మార్క్ పైకి చేరాయి. గురువారం పది గ్రాముల బంగారం ధర రూ.270 పెరుగుదలతో రూ.33,070కు ఎగసింది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర రూ.410 పెరుగుదలతో రూ.40,510కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ ఎగయడం ధరల పెరుగుదలకు దోహదపడింది. రూపాయి 70 స్థాయికి పడిపోవడంతో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1,294.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరుగుదలతో రూ.33,070కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరుగుదలతో రూ.32,920కు పెరిగింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.25,300గా నమోదైంది. వెండి ధర రూ.40,510 కి చేరగా.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.367 పెరుగుదలతో రూ.39,700కి పెరిగింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.78,000 ఉండగా.. అమ్మకం ధర రూ.79,000గా నమోదయ్యింది.

Tags

సంబంధిత వార్తలు