గోదారి పరుగుల గలగల

Updated By ManamFri, 07/13/2018 - 02:07
Godari
  • 30.5 అడుగులకు చేరిన నీటిమట్టం.. పెరుగుతున్న జలాశయాల నీటిమట్టం

imageఖమ్మం : ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు 30.4 అడుగులకు చేరుకుంది. దుమ్ముగూడెం వద్ద 13.2 అడుగులకు పెరిగింది. రాత్రి 9 గంటలకు 30.5 అడుగులకు చేరుకుంది. శుక్రవారం ఉదయం నాటికి ఇంకా పెరిగే అవకాశముంది. వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ జోరందుకుంది. భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం 6 గంటలకు 30.1 అడుగులకు తగ్గింది.  ఎగువ ప్రాంతాలైన కాళేశ్వరం, ఇంద్రావతి, పేరూరు వైపు నుంచి భారీగా వరద వస్తుండటంతో గురువారం సాయంత్రానికి మళ్లీ పెరిగింది. వర్షం కూడా ఆగకపోవడంతో ఇంకా కొన్ని అడుగుల మేర వరద వచ్చే వీలున్నట్లు సీడబ్ల్యుసీ అధికారులు అంచనా వేస్తున్నారు.

తాలిపేరు 14 గేట్లు ఎత్తివేత
చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లకు నీరు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు14 గేట్లు ఎత్తి 9,500 క్యూసెక్కులు నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. 

రిజర్వాయర్లు కళకళ
ఖమ్మం జిల్లాలోని రిజర్వాయర్లకు వరద నీరు వచ్చి చేరుతోంది. పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం 23 అడుగులకు గాను గురవారం నాటికి 17.45 అడుగులకు చేరింది. వైరా రిజర్వాయర్ నీటి మట్టం 18 అడుగులకు గాను నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 14 అడుగులకు చేరింది. బేతుపల్లి చెరువు 16 అడుగులకు గాను 8.10 అడుగులకు చేరింది.

Tags
English Title
Godari
Related News