ఎడ్ సెట్‌లో అమ్మాయిలదే ఆధిక్యం

Updated By ManamThu, 06/14/2018 - 06:45
edcet

 

  • ఫలితాలు విడుదల.. మొత్తం 30,606 మంది ఉత్తీర్ణత.. అందులో 24,236 మంది అమ్మాయిలు

హైదరాబాద్: తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌కు మొత్తం 38,693 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 32,330 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 30,606 మంది  అర్హత సాధించారు. పరీక్షకు హాజైరెన వారిలో 6562 మంది అబ్బాయిలు ఉండగా వీరిలో 6370(97.07శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 25768 మంది అమ్మాయిలు హాజరైతే.. 24236(94.05 శాతం) మంది అర్హత సాధించారు. అయితే ప్రతి పరీక్షలోనూ దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థులు తగ్గుతున్నారు. పురుషుల ఎన్‌రోల్‌మెంట్ కూడా తగ్గుతోంది. దీనికి సంబంధించి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు.
 

image


మెథడాలజీల వారీగా ఫలితాలు..
మెథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి 7495 మంది పరీక్ష రాస్తే.. 7211 మంది(1478 మంది పురుషులు, 5733 మంది మహిళలు) ఉత్తీర్ణులయ్యారు. ఫిజికల్ సైన్స్‌లో 2317 మందికి 2175(564 మంది పురుషులు, 1611 మంది మహిళలు) మంది, బయోలాజికల్ సైన్స్‌లో 8761 మందికి 8414(1327 మంది పురుషులు, 7087 మంది మహిళలు) మంది, సోషల్ స్టడీస్‌లో 13014 మందికి 12074(2810 మంది పురుషులు, 9264 మంది మహిళలు) మంది, ఇంగ్లీష్‌లో 743 మంది పరీక్షకు హాజరు కాగా 732(191 మంది పురుషులు, 541 మంది మహిళలు) మంది అర్హత సాధించారు.

నగరాల వారీగా..
రెండు తెలుగు రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో 55 కేంద్రాల్లో ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ పరిధిలో 6429 మంది పరీక్షకు హాజరైతే.. 6103 మంది, హైదరాబాద్ నార్త్‌లో 3531 మందికి 3375, హైదరాబాద్ సౌత్-ఈస్ట్ పరిధిలో 6009 మందికి 5625 మంది, హైదరాబాద్ వెస్ట్‌లో 3035 మందికి 2889 మంది, హైదరాబాద్ ఈస్ట్‌లో 2371 మందికి 2270, ఖమ్మంలో 2066 మందికి 2005 మంది, కరీంనగర్‌లో 2793 మందికి 2593 మంది, నిజా మాబాద్‌లో 466 మందికి 437, కోదాడలో 785 మందికి 727 మంది, మహబూబ్‌నగర్‌లో 362 మందికి 333, వరం ఠిగల్‌లో 3198 మందికి 3046 మంది, నల్లగొం డలో 298 మందికి 281, కర్నూల్‌లో 684 మందికి 627, విజయవాడలో 303 మందికి 295 మంది ఉత్తీర్ణత సాధించారు.

వివిధ స్పెషల్ కేటగిరీల్లో..
ఎడ్‌సెట్ ప్రవేశాలకు సంబంధించి ఎన్‌సీసీ కోటాలో643 మంది పరీక్షకు హాజరైతే.. 631 మంది ఉత్తీర్ణత సాధించారు. కాప్ కోటాలో 49 మంది రాస్తే.. 49 మంది, స్పోర్ట్స్ కోటాలో 283 మంది రాస్తే.. 275 మంది అర్హత సాధించారు. ఫిజికల్ ఛాలెంజ్డ్ కోటాకు సంబంధించి దృష్టి లోపం విభాగంలో 61 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైతే.. 61 మంది, వినికిడి లోపం విభాగంలో 9 మంది పరీక్ష రాస్తే.. 9 మంది, ఆర్థో లోపం విభాగానికి సంబంధించి 272 మంది పరీక్షకు హాజరయితే.. 255 మంది అర్హత సాధించారు.

రీజియన్ వారీగా ఫలితాలు..
ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్ పరిధిలో 31280 మంది పరీక్షకు హాజరైతే.. 29603 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రయూనివర్సిటీ పరిధిలో 232 మందికి 219 మంది, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 209 మందికి 192 మంది, నాన్‌లోకల్ పరిధిలో 609 మంది పరీక్ష రాస్తే.. 592 మంది అర్హత సాధించారు.

మీడియం వారీగా వివరాలు..
టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు, ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి 31424 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే.. 29873(95.06 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఉర్దూ, ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి 906 మంది పరీక్ష రాస్తే.. 733(80.91 శాతం) మంది అర్హత సాధించారు.

English Title
The girls had the lead in the Ed set
Related News