అటవీ పార్కులు ‘ఆరోగ్యా’నికి ఆస్తులు

Updated By ManamFri, 09/21/2018 - 05:59
sk josi
  • త్వరలోనే అందుబాటులోకి

  • సౌకర్యాలను పరిశీలించిన సీఎస్ 

s k josiహైదరాబాద్: అటవీ పార్కులు అందరి ఆర్యోగానికి ఆస్తులని, నగరీకరణ సమస్యలనుంచి ప్రజలు ఉపశమనం పొందేందుకు అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కే.జోషి అన్నారు. హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మహానగరం చుట్టూ తలపెట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల అధ్యయనంలో భాగంగా గురువారం అధికారుల బృందం మూడు పార్కులను సందర్శించింది. సీఎస్ నేతృత్వంలో వివిధ శాఖల ప్రత్యేక ప్రధానకార్యదర్శులు, ఉన్నతా దికారులు ఇప్పటికే అభివృద్ధి చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో సందర్శకుల సౌకర్యాలు, సహజ సిద్ధమైన అటవీని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయి పర్యటన చేశారు. అటవీశాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టూరిజం, అటవీ కార్పొరేషన్, టీఎస్‌ఐఐసీ, మెట్రో రైల్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న 59 అర్బన్ పార్కుల్లో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై అధికారులకు అవగాహన కల్పించేం దుకు ఈ పర్యటనను ఏర్పాటు చేశామని అటవీ ప్రధాన సంరక్షణ అధికారి పీకే.ఝా వెల్లడించారు. మేడ్చల్ పరిధిలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కును సందర్శించిన ఉన్నతాధికారులు అక్కడి సౌకర్యాలను చూసి కొనియాడారు. అనంతరం విజయవాడ రహదారి వెంట ఉన్న హరిత వనస్థలి జాతీయ పార్కు సమీపంలో ఏర్పాటు చేసిన మాన్సూరాబాద్ అర్బన్ పార్కులో అధికారులందరూ మొక్కలు నాటారు. సహజమైన అడవి, ప్రకృతి దెబ్బతినకుండా, కాంక్రీట్ వినియోగం లేకుండా అర్బన్ పార్కులను తీర్చిదిద్దాలని, మిగతా అటవీ ప్రాంతాన్ని పునరుజ్జీవం కోసం వినియోగిం చాలని సీఎస్ ఎస్‌కె.జోషి అటవీశాఖకు సూచించారు. ఈ పర్యటనలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యద ర్శి రామకృష్ణారావు, అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్‌మిశ్రా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి వికాస్ రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ జనార్థన్‌రెడ్డి, టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, రంగారెడ్డి కలెక్టర్ లోకేష్‌కుమార్, అటవీశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags
English Title
Forest Parks are property of 'health'
Related News