రాజకీయ కూడలిలో రైతన్న

Updated By ManamFri, 05/18/2018 - 00:47
image

image‘ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసగించడం చేతగాని ఏకైక వ్యక్తి అన్నదాతే’. ఇది అక్షరాలా నిజం. ఏళ్లు గడుస్తున్నా, ఎన్నెన్ని మార్పులొచ్చినా ఆ మోముల్లో సంతసం అంతంతే. రైతే రాజంటారు. అన్నదాతే ఆద్యుడంటారు. అమల్లో, ఆచరణల్లో చూ స్తే ఫలితాలు దిగదుడుపే. ప్రభుత్వాలు ఎన్నిమారినా, రైతు బతుకుచిత్రం మారడం లేదు. కోట్లు గడించినా, కోటలో విశ్రమించినా ప్రతి మనిషి అన్నదాతకు రుణ పడినవారే! విశ్వవిఖ్యాత కీర్తి గడించినా రోజూ వారు తినే ఆహార పదార్థాలు, అన్నం అన్నీ అన్నదాత చల వే, వారివారి స్థితిగతులను బట్టి జీవన విధానాలు, ఆహార అలవాట్లు వగైరా మారుతుంటాయి తప్ప అం తిమంగా అందరూ ఆ పంట పండించిన, తీసుకొ చ్చిన రైతుకు దాసోహమే. మరి ఆ కష్టజీవికి పరిపూ ర్ణ న్యాయం జరిగెదెప్పుడు? ఉన్నంతలోనైనా ఊరడిం పులు గట్టెక్కిస్తాయా అన్నదే ఇప్పటి ప్రశ్న. 

ఎన్నికలొస్తున్నాయి. మళ్ళీ రైతులు గుర్తుకొన్నా రు. వారి ఆదరణ పొందేందుకు, గెలిచేందుకు వారే ఆయుధంగా ఉపయోగపడుతుంటారు. మన దేశం లోని జనాభాలో వ్యవసాయంపైనే సింహభాగం ఆధా రపడి జీవిస్తుంటారు. సువిశాల భారతంలో అన్నదాత లే పాలకుల విధాన నిర్ణేతలవుతుంటారు. పట్టణీకరణ ఎన్ని పుంతలు తొక్కినా గ్రామాల్లో నివసించే, కష్టించే సాధారణ జనమే ఎక్కువగా ప్రభావం చూపుతారు. అందుకే ఎప్పుడు ఎన్నికలొచ్చినా అక్కున చేర్చుకు నేందుకు రాజకీయ పార్టీలు విన్యాసాలు చేస్తుంటాయి. మేనిఫెస్టోల పేరుతో పార్టీలు పరిచే ప్రణాళికల్లో ఎక్క డో చోట రైతుల ప్రస్తావన తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలో చాలాభాగం వారే నిర్ణేతలైనందున! 
ఒక్కోపార్టీ ఒక్కో రకమైన హామీలను కుమ్మరిస్తు న్నాయి. అదిచేస్తాం ఇది చేస్తాం అంటూ ఈ పాటికే రైతులపై ప్రేమను ప్రకటిస్తున్నాయి. రుణమాఫీలు, రెవెన్యూ రాయితీలు, పన్నుల్లో ఊరట ఇత్యాది ఈ కో వలోనివే, రైతుల్లో అధికశాతం నిరక్షరాస్యులున్న కారణంగా ఆ హామీల అమలుపై శాస్త్రీయ అవగాహ న కొరవడుతోంది. సగటు మనిషి స్వార్థజీవి అన్నచం దాన పార్టీలు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. బల హీనతే పెట్టుబడిగా ఎంచుకొని హామీల రూపంలో రాబడిని గెలుపు రూపంలో పొందేందుకు ఇదొక బా టగా ఏర్పరచుకుంటారు. చెప్పిన పనిచేశారా? ఆ పథ కం, ప్రణాళిక ఆచరణ సాధ్యమేనా అన్న దానికన్నా తాత్కాలిక ప్రయోజనాన్నిచ్చే వరాలపైనే మొగ్గు చూ పుతారన్నది మనం నిత్యం చూస్తుంటాం. 

పార్టీలు, ప్రకటనల మాటెల ఉన్నా క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయి. ఏ ఊర్లోకెళ్లినా ఏకరువులే మనకు దర్శనమిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే భిన్న వాతావరణ మేమీ మనకు కన్పించడం లేదు. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక, అనేక కష్టాల్లో కర్షకు లు చిక్కుకుని ఉన్నారు. కదిలిస్తే భగ్గుమంటున్నారు. దాదాపుగా అన్నిరకాల పంటల పరిస్థితీ ఇదే. ఇలాం టి తరుణంలో మరి కొద్దికాలంలోనే దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ముందు పాలనా కాలం చివర్లో రైతుల వద్దకు అంటే గ్రామాల్లో నేతలు పర్యటించడం అనివార్యం. ఇదిలా ఉంటే ఆ వచ్చే నేతలను, పార్టీలను నిలదీసి తమ కష్టానష్టాల కన్నీళ్ళను నివేదించి సవాలక్ష ప్రశ్నలు సం ధించడం మానరు. ఎందుకంటే వారి బాధ వర్ణనాతీ తం. గ్రామాల్లో కెళితే పరిస్థితి దయనీయంగా ఉంది. గిట్టుబాటు ధరల్లేవు. పెట్టుబడి వడ్డీలు పెరిగిపోతు న్నాయి. రేట్లు చూస్తే ఇంకా ఇంకా దిగజారుతున్నా యి. ముఖ్యంగా వరితో పాటు మొక్కజొన్న, కందు లు, మినుములు, మిర్చి వగైరా వాణిజ్య పంటలు అమ్ముకోలేక కళ్లనీళ్లు కుక్కుకుంటున్నారు. ఎన్నికల స మయంలో ప్రకటించే హామీల్లో ఆదర్శవంతమైన ప్ర ణాళికలు కూడా ఉండ వచ్చు. వాటి అమలు, చిత్తశుద్ధిపైనే పలువురికి ఎడతెగని సందేహం. ఎన్నికలయ్యాక వాటికి దుర్గతి పట్టకూడదనేదే ఓటర్ల అభిమతం. ఒక వేళ ఆ పథకాలు కొన సాగించినా, ఆ భారం ప్రజలపై పడుతుంద న్నది తెలిసిందే. ఈ ఎన్నికల వ్యయాన్ని రాబ ట్టుకునేందుకు అంతి మంగా ప్రజలే లక్ష్యంగా పాలకులు ప్రయత్నిస్తారని మనందరికీ తెలిసిందే. 

మద్ధతు ధర ఓ బ్రహ్మ పదార్ధం. ప్రతి సీజన్లో పంట ఉత్పత్తులు చేతికొచ్చినప్పుడల్లా ఈ స్వరం విని పిస్తూనే ఉంటుంది. అన్నదాతల ఆక్రందనలు మిన హా ఫలితం శూన్యం. అన్ని రాష్ట్రాల నుంచి సాగుకు సంబంధించిన వివరాలు సేకరించి జాతీయ సగటు ఆధారంగా ప్రస్తుతం మద్ధతుధర నిర్ణయమౌతోంది. సాగు వ్యయం అధికంగా ఉండే రాష్ట్రాల్లోని రైతులకు అక్కడే అన్యాయం జరుగుతోంది. వరిని తీసుకుంటే  జాతీయ వ్యవసాయ కమిషన్ 2006 నివేదిక ప్రకారం 2018 సంవత్సరానికి క్వింటాలు ధర రూ.2,226గా నిర్ణయించాలి. అయితే కేంద్రం ప్రకటించిన ధర రూ. 1,550 మాత్రమే, దీని ప్రకారం ప్రభుత్వం ప్రకటిం చిన మద్ధతు ధరలోనే ప్రతిక్వింటాకు రైతు రూ. 676 నష్టపోతున్నారన్న మాట. అయినా ప్రభుత్వం ప్రక టించిన అరకొర ధరకైనా ధాన్యం కొనుగోలు చేసే యంత్రాంగం ఉందా అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, తీరా కొన్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అవసర మైన గోడౌన్‌లు లేవు. ఇలా సేకరించిన ధాన్యం గోదా ముల్లో ఆరుబయట భారీ సంఖ్యలో సంచుల్లో ఉండ టం మనమెప్పుడూ చూస్తూనే ఉంటున్నాం. ఒక్క వరి పంట ఉత్పత్తినే కాకుండా, వాణిజ్య పంటల ధర ల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం. మన రైతుల దగ్గర కనీస మద్దతు ధరకు ధాన్యం కొనకుండా, విదేశీ రైతులకు అంతకంటే ఎక్కువ ధర ఇచ్చి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం కూడా అప్పు డప్పుడు జరుగుతున్నట్లు వింటున్నాం. వేర్‌హౌస్‌లు, గోడౌన్లు, స్టోరేజీలు వగైరా పేరిట వ్యవసాయ రుణా లుగా ప్రకటించేశారు. ఒక్కసెంటు భూమిలేని ముంబ యిలో టాటా లాంటి కంపెనీలు కొన్ని కోట్ల రూపా యలు వ్యవసాయ రుణాన్ని తీసుకోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. ఆర్థిక సంస్కరణల పేరిట ప్రభుత్వాలు వ్యవసాయ రుణాలను పక్కదారి ప ట్టించి అసలైన వ్యవసా యదారులకు రుణాలు అందకుండా చేశాయి. ఇదిలా ఉంటే ధాన్యం కొనుగొళ్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు వార్తలొ చ్చాయి. దీంతో ధా న్యాగారమైన ఆంధ్రప్ర దేశ్‌లో వరి రైతులు పం టలు అమ్ముకునేందుకు అష్టకష్టాలు ఎదుర్కొన్న ట్లు కూడా వినిపిస్తోంది. ఈ ఏడాది రబీలో ఎకరాకు సుమారు 40 నుంచి 50 బస్తాలు పైనే దిగుబడి వ స్తోంది. ఎకరాకు 40 బస్తాలు మించి ధాన్యం కొను గోలు చేయొద్దని ఆంక్షలున్నట్లు చెబుతున్నారు. అసలే మద్దతు ధరల విషయంలో అల్లాడుతుంటే ఈ ఆంక్షల గోలేమిటని రైతులు వాపోతున్నారు. ఏడాదికేడాది జీ వనవ్యయ సూచికలే ప్రాతిపదికగా ఉద్యోగుల వేతన సవరణ సాగుతున్నప్పుడు ఆ విధానం మద్దతు ధర ల్లోనూ ఉండాలి కదా అంటూ రైతులు నిట్టూరుస్తు న్నారు. కాగా, దేశవ్యాప్తంగా ఏదోచోట రైతుల ఆక్రం దనలు వింటూనే ఉన్నాం. ధరల్లేక, వడ్డీలు కట్టలేక, సాగు కష్టాలు గట్టెక్కలేక, జీవనం భారమై విగతజీవులవుతున్నారు. ప్రధానంగా ఈ ఏడాది రైతుల ఆత్మ హత్యలపై ఎంతో చర్చ జరుగుతూనే ఉంది. వారి ఆ గ్రహం ఏ స్థాయిలో ఉందో ఇటీవలే మనందరం చూ శాం. మండుటెండలో దాదాపు 200 కిలోమీటర్లు న డుచుకుంటూ వేలాదిమంది మహారాష్ట్ర రైతులు ముం బయి నగరానికి చేరుకుని తమ నిరసనను తెలియ జేసి అక్కసు వెళ్లగక్కారు. పంటరుణాలు, విద్యుత్ సరఫరా బిల్లులను సంపూర్ణంగా మాఫీచేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో ర్యాలీని చేశారు. ఇదేస్ఫూర్తిగా దేశవ్యా ప్తంగా రైతులు కూరగాయలు, పాలు, ధాన్యాలు, తది తర ఉత్పత్తులను జూన్ 1 నుంచి పదిరోజుల పాటు నిలిపివేయనున్నారని రాష్ట్రీయ మాహాసంఘ్ తెలిపిం ది. 110 రైతు సంఘాలు ఒక్క తాటిపై కొచ్చి కేంద్రం రైతు వ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తంచేస్తూ నిర ్ణయం తీసుకున్నాయి. కాగా రైతుల కన్నెర్ర ఎలా ఉం దంటే ఆ మధ్య మహారాష్ట్ర గవర్నర్‌కు ఏకంగా 91 మంది రైతులు ఆశ్చర్యకరంగా కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ ఓ లేఖ రాశారు. 

తెలంగాణా, ఆంధ్ర ఉభయ రాష్ట్రాల్లో రైతులకు ఉపశమనం కలిగించే చర్యలకు ప్రభుత్వాలు ఉపక్ర మించాయి. మరికొద్దిరోజుల్లో ఆరంభమయ్యే ఖరీఫ్ సీజన్లో రైతుల కోసం ప్రత్యేకంగా రైతుబంధు పేరిట తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రజల ముంగిటకు తెచ్చింది. ప్రతిరైతుకు నేరుగా 8 వేల రూపాయల వంతున ప్రభుత్వసాయం అందనుంది. కోటీ 30 లక్షల ఎకరాలకు సంబంధించి 58 లక్షల మంది రైతులకు ఈ సాయం అందనుంది. ఆంధ్రప్ర దేశ్ విషయానికొస్తే రైతులకు అందించే రుణాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ అ నుబంధ రంగాల్లో జాతీయస్థాయి వృద్ధిరేటు కన్నా రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా నమోదవడం ఈ సంద ర్భంగా ప్రస్తావనార్హం. ఇదే ప్రాతిపదికగా 2018-19 బడ్జెట్లో నిధుల కేటాయింపు పెంచాలని ఏపీ ప్రభు త్వం నిర్ణయించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో రూ. 91,557 కోట్ల రుణాలు ఇవ్వాలనుకుంటోంది. ఇందు లో పంట రుణాల కింద రూ.65,163 కోట్లు, దీర్ఘకా లిక రుణాలుగా రూ.26,394 కోట్లుగా నిర్దేశించారు. ఎక్కువమంది రైతులకు రుణాలివ్వాలని భావిస్తున్న నేపథ్యంలో గత ఏడాది కన్నా రూ.4086 కోట్లు అదనంగా కేటాయించారు. రైతులు అనేక కష్టాలకు లోనవకుండా సుదీర్ఘ పాదయాత్రలు, నిరసనలు చేయకుండా ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరిం చాల్సి ఉంది. ఎన్నికల సమ యంలో సహేతుకమైన, ఆచరణయోగ్యమైన హామీల ను ప్రజల ముందుకు తీసుకెళితేనే రైతుముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. పాలనాధికారం కట్టబెడతా రు. ఇక రైతు సమస్యల పరిష్కారంలో పలు చర్యలు తీసుకోవాల్సింది.
- చెన్నుపాటి రామారావు
9959021483. 

English Title
farmer in the political junction
Related News