కుటుంబంతో.. కులాసాగా!

akhilesh yadav
  • సీబీఐ విచారణతో బాధేమీ లేదు

  • వారివన్నీ తప్పుడు ఆరోపణలే

  • మా కూటమి లెక్కలు కావాలేమో

  • నాడు కాంగ్రెస్‌పార్టీ.. నేడు బీజేపీ

  • యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్

న్యూఢిల్లీ: తన మీద సీబీఐ విచారణ జరుగుతున్నా.. తనకేమీ బాధ లేదని, కుటుంబంతో కులాసాగా గడుపుతున్నానని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఒక ట్వీట్‌లో చెప్పారు. అక్రమ వైునింగ్‌కు సంబంధించి అఖిలేశ్‌పై దాదాపు 20 కేసులను సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన మాత్రం తన భార్య డింపుల్ యాదవ్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి తన ఆఫీసు గదిలో కులాసాగా కూర్చుని టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకొంటున్నట్లున్న ఫొటోను ట్వీట్ చేశారు. దాంతో పాటు ఒక హిందీ కవితను కూడా అక్కడ పోస్ట్ చేశారు. ‘‘నేను వార్తల్లోకి ఎందుకు వచ్చానో ప్రపంచానికి తెలుసు, వార్తల పునాదే చెడ్డైదెనప్పుడు దాని గురించి బాధ ఎందుకు’’ అని దాని అర్థం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గనుల శాఖను తనవద్దే ఉంచుకున్న అఖిలేశ్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అక్రమ వైునింగ్ కేసులో అఖిలేశ్ హస్తం ఉందనే విషయాన్ని రుజువుచేసే పత్రాలు తమ వద్ద ఉన్నాయని.. మొత్తం 22 వైునింగ్ లీజులు ప్రశ్నార్థకంగా ఉంటే వాటిలో 14 ఫైళ్లను అఖిలేశే ఆమోదించారని, మిగిలినవాటిని ఆయన మంత్రి గాయత్రీ ప్రసాద్ ఆమోదించారని సీబీఐ వర్గాలు అంటున్నాయి. యూపీ సర్కారు మంజూరుచేసిన లీజులను అలహాబాద్ హైకోర్టు రద్దుచేసిన 18 రోజుల తర్వాత.. వాళ్లకే మళ్లీ కాంట్రాక్టులు వచ్చాయని.. దానికి ఆయన సమాధానం చెప్పి తీరాలని కేసులను విచారిస్తున్న ఒక అధికారి అన్నారు. అయితే తనపై సీబీఐ విచారణ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అఖిలేశ్ వాదిస్తున్నారు. ఇప్పుడు సీబీఐ అధికారులకు తాము ఎస్పీ-బీఎస్పీ కూటమిలో ఎవరికెన్ని సీట్లిచ్చామో చెప్పాలని.. ఎట్టకేలకు బీజేపీ తన అసలు రంగు చూపించిందని ఆయన విమర్శించారు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తమకు సీబీఐని కలిసే అవకాశం కల్పిస్తే, ఇప్పుడు బీజేపీ ఆ పని చేసిందని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షాలు అఖిలేశ్ మీద సీబీఐ విచారణపై సోమవారం గందరగోళం సృష్టించాయి. 

సంబంధిత వార్తలు