ఏకకాల ఎన్నికలు

Updated By ManamThu, 07/12/2018 - 00:55
image

imageఏకకాల (జమిలి) ఎన్నికల నిర్వహణ వివాదం మళ్ళీ తెర మీదకు వచ్చింది. జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను లా కమిషన్ కోరడం మళ్లీ ఈ అంశం చర్చనీయాంశమైంది. లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై అఖిలపక్ష సమావేశంలో 2021 వరకు జరిగే అసెంబ్లీ ఎన్ని కలను 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహించాలనే ప్రతిపాదనతో కూడిన పత్రాన్ని  జాతీయ న్యాయ కమిషన్ చర్చకు ప్రవేశపెట్టింది. తొమ్మిది రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చగా నాలుగు పారీ ్టలు ఆ పత్రాన్ని ఆమోదించాయి. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు మద్దతు తెలిపిన నాలుగు పార్టీలు కూడా రెండు కఠిన షరతులు విధించాయి. జమిలి ఎన్నికల్ని అన్నాడిఎంకె పార్టీ 2024 నుంచి నిర్వహించాలని ప్రతిపాదించగా, సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల నుంచి నిర్వహించా లని మెలికపెట్టాయి.

ఎస్‌పి కోరిక మేరకు 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి జమిలి ఎన్నికలు మొదలైతే ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రద్దవుతుంది. ఇది బీజేపీకి పూర్తిగా మింగుడుపడని అంశం. 2021 తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుగు తాయి కాబట్టి యూపీ తదితర రాష్ట్రాల అసెంబ్లీ కాలాన్ని పొడిగించాల్సి ఉంటుం ది కాబట్టి సమాజ్‌వాదీ పార్టీ అందుకు ఇష్టపడదు. టీఆర్‌ఎస్, శిరోమణి ఆకాలీదళ్ పార్టీలు జమిలి ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటించగా, వామపక్షాలు పూర్తిగా తిరస్కరించాయి. వచ్చే నెలాఖరులోపు ప్రస్తుత లా కమిషన్ పదవీ కాలం ముగు స్తుందనగా ఎన్నికల సంస్కరణపై గత లా కమిషన్ చేసిన సిఫారసులను నిర్లక్ష్యం చేసి, ఒక్క జమిలి ఎన్నికలపై మాత్రమే అభిప్రాయ సేకరణను ప్రారంభించడంపై పలు సందేహాలు వస్తున్నాయి. జమిలి ఎన్నికల ప్రతిపాదనను మళ్ళీ తెర మీదకు తెచ్చిన మోదీ సర్కారు... లా కమిషన్‌కు అధికారికంగా తన ప్రతిపాదనను అందించనే  లేదు. బెల్జియం, స్వీడన్, దక్షిణాఫ్రికా వంటి కోటి జనాభా కూడా లేని చిన్న దేశాల్లో జరిగే జమిలి ఎన్నికల ప్రక్రియను ప్రాంత, మత, జాతి, కుల తదితర బహుళ అస్తిత్వాలున్న భారత్‌లో అమలు చేయాలని ప్రయత్నించడం అసాధ్యమని పలువురు ప్రజాస్వామికవాదులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఖర్చు నివారించాలనే ఉద్దేశంతో బలవంతంగా జమిలి ఎన్నికలు నిర్వ హిస్తే ప్రజాస్వామిక, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మెజారిటీ రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికల నిర్వహణ కోసం సమ్మతి తెలిపి నంత మాత్రాన సరిపోదు. అంతకంటే ముఖ్యంగా పార్లమెంట్‌లో మూడింట రెండువంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాల్సి ఉంటుం ది. సగం రాష్ట్రాలు ఆ ఎన్నికలను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితి లో రాజకీయ ఏకాభిప్రాయం లేకుండా రాజ్యాంగ సవరణ అసాధ్యం. స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి వరుసగా నాలుగు ఎన్నికలూ (1952, 1957, 1962, 1967) జమిలి ఎన్నికలే. అయితే కేరళ, పంజాబ్ రాష్ట్రాలు కొత్తగా ఏర్పడటం, ఆ తర్వాత అక్కడి అధికార పక్షాలు మెజారిటీ కోల్పోయి, 1954లో మధ్యంతర ఎన్నికలు జరగడంతో దేశంలో విడివిడి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 1967 తర్వాత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మెజారిటీ కోల్పోయి మధ్యంతర ఎన్నికలు జరగడమనే ధోరణి ముందుకొచ్చింది. అయితే 4వ ఎన్నికలో కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడినపుడు కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది.

ఆ తర్వాత కాలంలో 1971లో ఇందిరాగాంధీ లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలకు వెళ్లిననాటినుంచి ఎన్నికలు ఒకేసారి జరపడమనేది లేకుం డాపోయింది. 1990ల తర్వాత ప్రపంచీకరణ పర్యవసానంగా ఉనికిలోకి వచ్చిన సంకీర్ణ రాజకీయ యుగంలో విడివిడి ఎన్నికల ప్రక్రియ ఒక అనివార్యమైన పద్ధతిగా స్థిరపడింది. 1995లోనే జమిలి ఎన్నికలు జరపాలని బీజేపీ అధ్యక్షుడు అద్వానీ ప్రతిపాదించారు. 1999లోనే లా కమిషన్ జమిలి ఎన్నికలను సిఫార్సు చేసింది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం, సంకీర్ణ కూటముల (యూపీఏ, ఎన్డీఏ) పాలనా వైకల్యం తదితర కారణాల నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సుదర్శన్ నాచియప్పన్ నాయకత్వంలోని పార్లమెంటు స్థాయీ సంఘం ఒకేదఫా ఎన్నికల నిర్వహణ సరైనదని సిఫార్సు చేసింది. ప్రాంతీయ తదితర అస్తి త్వ పార్టీలను బుజ్జగించే సంకీర్ణ రాజకీయాల కారణంగా ప్రభుత్వం నిలుపు కునేందుకు సంకీర్ణ భాగస్వామ్య పక్షాల అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని కూడా భరిం చవలసి రావడం జాతీయ పార్టీలకు తలనొప్పిగా మారింది.

కుంభకోణాలు తలెత్తడమే కాకుండా వాటి నుంచి తప్పించుకునేందుకు, న్యాయ వ్యవస్థతో సహా రా జ్యాంగ వస్థల స్వయంప్రతిపత్తిని కాలరాస్తున్నాయి. కొన్ని దేశాల్లో మాదిరిగా ఎన్నికైన ప్రజాప్రతినిథులను, ప్రభుత్వాలను రికాల్ చేసే హక్కు లేకపోయినా, అధికార పక్షం ప్రవేశపెట్టే/ అమలు చేస్తున్న విధానాలను రికాల్ చేసే రాజ్యాంగ పరమైన అవకాశమున్నప్పటికీ, అవకాశవాద రాజకీయ ఆచరణ నడుస్తున్న వాతా వరణంలో అది అసాధ్యంగా తయారైంది. ఆశ్రిత కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం దేశ ప్రజల భవిష్యత్‌ను పణంగా పెట్టే రాజకీయార్థిక విధానాలు, నేరపూ రిత రాజకీయాలు మారనంత వరకు ఎన్నికలు ఏ రూపంలో జరిగినా ఫలితం శూన్యమే!  

English Title
ఏకకాల ఎన్నికలు
Related News