ఈసీ ఆగ్రహం.. హరీశ్, రేవంత్‌కు నోటీసులు

Updated By ManamFri, 11/09/2018 - 19:12
EC, notices, Harish rao, Revanth Reddy, Revuri Prakash Reddy, Rajath Kumar
  • నోటీసులు జారీచేసిన రజత్ కుమార్ 

  • 48 గంటల్లో వివరణ ఇవ్వాల్సిందిగా నేతలకు ఆదేశాలు 

EC fires and send notices to Harish rao, Revanth reddy on Political commentsహైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నేతలు వివాదాస్పద వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలను వేడిక్కిస్తున్నారు. ఎన్నికల కోడ్ నియామళి అమల్లో ఉన్న నేపథ్యంలో పలు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలంతో దూషించుకోవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదులపై స్పందించిన ఈసీ ఎన్నికల నియమావళిని ఉల్ఘంచిన నేతలపై చర్యలు చేపట్టింది.

ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ రెడ్డి, వంటేరు ప్రతాప్‌ రెడ్డి, టీడీపీ నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వీరికి నోటీసులు జారీ చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. ఈసీ నోటీసులపై 48గంటల్లోగా వీరంతా వివరణ ఇవ్వాలని రజత్ ఆదేశించారు.

English Title
EC fires and send notices to Harish rao, Revanth reddy on Political comments
Related News